Wednesday, June 5, 2019

Mamidikoru Pachhadi

కావలసినవస్తువులు    :

మామిడికాయలు      :   4( కాయలుకడిగి  బట్టతో తుడిచి  ఆరబెట్టి  పీల్ చేసి కోరుకోవాలి)

కారం                         :   1గ్లాస్
సాల్ట్                          :   1 గ్లాస్
వెల్లుల్లి                      :  8 రెబ్బలు
ఆవపిండి                 :  1/4 గ్లాస్
మెంతిపిండి             :  1/4 గ్లాస్ లో సగం
జీలకర్రపొడి             : 2 స్పూన్స్
తాలింపు                   :  ఆవాలు  3 స్పూన్స్, జీలకర్ర పొడి  2 స్పూన్స్,తరిగిన అల్లం  1 స్పూన్, ఇంగువ కొంచెం ,కరివేపాకు  3 రెబ్బలు, ఎండుమిరపకాయలు 6, వెల్లుల్లి రేబాలు 7 ( కొంచెం చిదమాలి)
తయారుచేయువిధానము   :

ముందుగా  మామిడి తురుము  ని ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో నొక్కి పెట్టి అట్లా  నాలుగు గ్లాసులు  తీసుకుంటే  దానిలోకి ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ సాల్ట్, అదే గ్లాస్ లో 1/4 గ్లాస్ ఆవపిండి,
దానిలో సగం  మెంతిపిండి  వేసి అన్ని కలిపి  ఉంచాలి . 1 స్పూన్ పంచదార  వెయ్యాలి.   స్టవ్ మీద మూకుడు పెట్టి  ఒక గ్లాస్ ఆయిల్ వేసి  కాగాక  ఆవాలు, ఇంగువ కొంచెం , కరివేపాకు కొంచెం, జీలకర్ర పొడి 2 స్పూన్స్, 1 స్పూన్ తరిగిన అల్లం వేసి, వేయించి  స్టోవే ఆఫ్ చెయ్యాలి. కొంచెం వేడి తగ్గాక  పైన పచ్చడిలో  వేసి కలిపి  , పచ్చడి టేస్ట్  చూసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే  కొంచెం వేసుకోవచ్చు. అన్ని సరిపోయాక  పచ్చడి ఆరాక బాటిల్ లోకి తీసుకోవాలి.





Allam Pachhadi with Pachhimamidikaya tho

కావలసినవస్తువులు    :

 అల్లం                                        :  1/2 కేజీ (సుబ్బరంగా కడిగి  పీల్ చేసి కాసేపు తడి ఆరేదాకా ఎండలో పెట్టాలి)
పచ్చి పుల్లటిమామిడికాయలు :   1/2 కేజీ ( పెద్దవి  2 కాయలు  పీల్ చేసి  ముక్కలు  గ కట్ చేసుకోవాలి)
కారం                                          :  200 గ్ర
సాల్ట్                                           :  200గ్ర
వెల్లుల్లి రెబ్బలు                        :  100 గ్ర
బెల్లం                                         :  700 గ్ర
మెంతులు                                 : 10గ్ర (మూకుడులో ఆయిల్ లేకుండా వేయించి  మిక్సీ పట్టి ఉంచాలి)
ఆయిల్                                     :  200గ్ర
తాలింపు                                   : ఆవాలు  4 స్పూన్స్ , జీలకర్ర  4 స్పూన్స్ , వెల్లుల్లి రెబ్బలు 8,ఇంగువ కొంచెం, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు కొంచెం ,



తయారుచేయువిధానము   :

ముందుగా  అల్లం ని  చిన్న ముక్కలుగా కట్ చేసి  మూకుడులో కొంచెం ఆయిల్ వేసి వేయించాలి ,కాసేపటితరవాత  మామిడిముక్కలు కూడా వేసి తిప్పి వేడి అయ్యాక  స్టవ్ ఆఫ్ చెయ్యాలి  వేడి తగ్గాక  మిక్సీపట్టి  ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దానిలోకి కారం,సాల్ట్, వెల్లుల్లిరెబ్బలు మెంతి పొడి  , బెల్లం కూడా వేసి అన్ని కలిపి కొంచెం కొంచెం మిక్సీలో వేసి మెత్తగా  ఆడించి  వేరే బౌల్ లోకి తీసులోవాలి . స్టవ్ మీద వేరే పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక ఆవాలు,జీలకర్ర  వెల్లుల్లి 8 రెబ్బలు,ఇంగువ కొంచెం ఎండుమిరపకాయలు 5,
కరివేపాకు కొంచెం వేసి వేగాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి . కొంచెం వేడితగ్గాక  పైన పచ్చడిలో  వేసి కలపాలి. కాసేపటి తరవాత  పికెల్  టేస్ట్ చూసుకోవాలి.  అన్ని సరిపోతాయి  లేదంటే కొంచెం సాల్ట్ కానీ కారం కానీ మనకు కావలిసినవి  కొంచెం వేసుకోవాలి. పచ్చడిలో ఆయిల్ సరిలేకపోతే ఇంకా కొంచెం వేడి చేసి ఆయిల్ వేడి తగ్గాక  పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చడి రైస్ తో తిని చూసుకోవాలి కరెక్ట్ గ అన్ని సరిపోయాయి లేదో తెలుస్తుంది. పచ్చడి వేడి పూర్తిగా తగ్గాకే జాడీలోకి కానీ, బాటిల్ లోకి  కానీ తీసుకోవాలి.



Sunday, May 26, 2019

Parotha

కావలసినవస్తువులు   

మైదా పిండి      :  2 కప్స్
ఆయిల్             :  1/2 కప్
సాల్ట్                 : కొంచెం
వాటర్              : సరిపడ


తయారుచేయువిధానము       :

ముందుగా  బౌల్ లోకి మైద  తీసుకొని, సాల్ట్ వేసి , కొంచెం ఆయిల్ వేసి  కలిపి , కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకొని  చపాతీపిండి కన్నా కొంచెం లూస్ గ  కలిపి బౌల్ లో పెట్టి కవర్ చేసి 3 గంటలు తరవాత  తీసి దానిని నాలుగు భాగాలుగా చేసి  ఒక భాగాన్ని పల్చగా చేసి ఆయిల్ రాస్తూ పలచగా చేసి దానిని  పైకి పట్టుకొని చుట్టుగా తిప్పి ప్రక్కన పెట్టి దానిని చపాతీ లాగా చేసి
పెనం మీద కొంచెం ఆయిల్ వేసి  పరోటని వేసి ఆయిల్ వేస్తూ కాల్చాలి.చేతులతో గాని , చెక్క కర్రతో గాని    రెండువైపుల ప్రెస్ చెయ్యాలి పొరలుగా విడి పోయి  పరోఠా  పొరలుగా  వస్తుంది

Munagakaya Jeedipappu Curry

కావలసిన వస్తువులు    :

ము న గకాయ ముక్కలు   :  1 కప్ ( కొంచెం నీటిలో  సాల్ట్ వేసి ఉడకబెట్టాలి )
ఉల్లిపాయలు                   :  2 ( చిన్న ముక్కలుగా కట్   చేసుకోవాలి)
టొమాటోస్                        :  3 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి                       :  2 (చీలికలు చేసుకోవాలి)
కారం                                 :  2 స్పూన్స్
పసుపు                              :  1 స్పూన్
జీడిపప్పు                         :  1 కప్
అల్లంవెల్లులిపేస్ట్           :  1 1/2 స్పూన్
జీరా పొడి                         : 1 స్పూన్
గరం మ                           :  1 స్పూన్
సాల్ట్                                 : సరిపడ
కరివేపాకు                        :  2 రెబ్బలు
కొత్తిమీర                           : కొంచెం
తాలింపు                          :  ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్

తయారుచేయువిధానము   :

ముందుగా స్టవ్ వెలిగించి   మూకుడు పెట్టి  ఆయిల్ వేసి  తాలింపు వేసి ,పర్చిమిర్చి ,కరివేపాకు వేసి , ఆనియన్స్ వేసి , పసుపు , సాల్ట్ వేసి  వేపాక  టొమాటోస్ , జీడిపప్పు కారం,వేసి తిప్పాలి. దానిలో మూలగకాయ  ముక్కలు  ,కొంచెం ఆ మరిగిన వాటర్ కూడా   వేసి కొంచెం తిప్పి జీరాపొడి, మసాలా కూడా వేసి మూత పెట్టి చిన్నమంట పెట్టి   కాసేపు  ఉంచాలి. 5 నిమిషాల తరవాత  మూత తీసి  కొత్తిమీర కూడా వేసి తిప్పి బౌల్ లోకి  తీసుకోవాలి.



Cabbage Kobbari Roti Pachhadi

కావలసినవస్తువులు    :

కేబేజి                  :  చిన్నది ( చిన్న గ కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి         :  8 లేదా  కారాన్ని బట్టి ఇంకా 2 వెయ్యవొచ్చు
చింతపండు      : కొంచెం
జీలకర్ర              :  2 స్పూన్స్
వెల్లుల్లి               :  7 రెబ్బలు
కొబ్బరి                : చిన్నముక్క
సాల్ట్                   :  సరిపడ
ఆయిల్             :   4 స్పూన్స్

తయారుచేయువిధానము 

స్టవ్ వెలిగించి పాన్ పెట్టి  ఆయిల్ వేసి   కేబేజి  ,పర్చిమిర్చి వేసి తిప్పాలి కొంచెం వేగాక దానిలో కొబ్బరి, జీలకర్ర , వెల్లుల్లి, సాల్ట్,చింతపండు వేసి  తిప్పాలి . చల్లారాక  అన్నింటిని మిక్సీ పట్టాలి. పచ్చడి నెయ్యి వేసుకొని తింటే  చాల   టెస్ట్ గ  ఉంటుంది.


Cholay curry for parathas

కావలసిన వస్తువులు    :

సెనగలు            :  1/4 కేజీ
ఉల్లిపాయలు    :  3(  సన్నగా కట్ చేసి  ఉంచాలి)
టొమాటోస్         :  3 (  గ్రైండ్  చేసిఉంచాలి)
పర్చిమిర్చి         : 2  ( చిన్న గాటు  పెట్టాలి)
అల్లం వెల్లుల్లి   :  2 స్పూన్స్ 
కరివేపాకు         :  2 రెబ్బలు
కొత్తిమీర            :  కొంచెం
కారం                 :  2 స్పూన్స్
సాల్ట్                  : సరిపడ
పసుపు              :  1 స్పూన్
గరంమసాలా    :  2 స్పూన్స్
ఆయిల్             : 4 స్పూన్స్
 తయారు చేయువిధానము   :

ముందుగా సెనగలని  కుక్కర్ లో 2 కప్ లకి 3 కప్ ల వాటర్ వేసి , కొంచెం సాల్ట్, పసుపు వేసి  4 విజిల్స్  వచ్చాక ఆఫ్ చెయ్యాలి.  స్టవ్ మీద  పాన్ పెట్టి  ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి  తిప్పి ఉల్లిపాయలు వెయ్యాలి. సాల్ట్,పసుపు,వేసి తిప్పి పర్చిమిర్చి, కరివేపాకు వేసి, కారం, ,   టమాటో   కూడావేసి, కాసేపు తిప్పాక మూతపెట్టి కాసేపు సన్నటి సెగ మీద ఉంచా క మూతతీసి   ఉడికిన  సెనగలు కొంచెం వాటర్ తో  వేసి, డ్రై మాంగో పాడేరు( ఆంచూర్ పొడి) కొంచెం వేసి, మసాలా కూడా వేసి  మూత  పెట్టి కాసేపు ఉంచి ,మూతతీసి  కొన్ని సెనగలని  ( గుజ్జుగా  కూర ఉండటానికి )పప్పు గుత్తి తో  మెత్తగా  నొక్కాలి, ,కొతిమీరకూడా   వేసి తిప్పి బౌల్ లోకి తీసుకోవాలి.
  

Thursday, May 23, 2019

Kova Basin Laddu

కావలసినవస్తువులు      :

సెనగపిండి            :  2 కప్స్
కోవ                          :  1/2 కప్  (స్వీట్ కోవా)
నెయ్యి                     :  1/2 కప్
పంచదార               :  1/2  కప్ ( మిక్సీ చేసి  ఉంచాలి)
జీడిపప్పు                :  కొంచెం ( చిన్నగా కట్ చేసుకోవాలి)
బాదం  పప్పు           :  కొంచెం( చిన్నగా కట్ చేసుకోవాలి)
పిస్తా                         :  కొంచెం ( చిన్నగా కట్ చేసుకోవాలి)
యాలకుల పొడి     "  2 స్పూన్స్

తయారుచేయువిధానము   :

 ముందుగా  పాన్  స్టవ్ మీద పెట్టి  జీడిపప్పు,బాదం పప్పు,  పిస్తా  కొంచెమ్ నెయ్యి వేసి వేయించి ఒక  బౌల్ లో తీసుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసి  సెనగపిండి కొంచెం వేయించాలి. వేగాక దానిలో  కోవ  వేసి కాసేపు తిప్పి, దానిలో పంచదార పొడి,డ్రై ఫ్రూప్ట్స్, యాలకుల పొడి , అన్ని  వేసితిప్పి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. వేడి తగ్గాక  అవసరం ఐతే  కొంచెం నెయ్యి వేసి లడ్డులు చుట్టాలి.
ఇవి చాల టేస్టీ గ ఉంటాయి.


Wednesday, May 22, 2019

Badhusha


బాదుషాలు 
కావలసిన వస్తువులు   :

మైద                         :  1 కప్          
పంచదార                :  1 కప్
నెయ్యి                      :   1/2 కప్
సాల్ట్                         :  1/4 స్పూన్
పెరుగు                     : 2 స్పూన్స్
వాటర్                       :  1/4 కప్
బేకింగ్ పొడర్           : 1/4 స్పూన్
ఆయిల్                    :  వేయించడానికి సరిపడ

తయారుచేయువిధానము   :
ముందుగా  స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో పంచదార వేసి  1/4 కప్ వాటర్ వేసి లేత పాకం (తీగ పాకం) వచ్చాక స్టవ్  ఆఫ్ చేసి ప్రక్కన పెట్టాలి.
ముందుగా మైదా ని జల్లించుకోవాలి . దానిలో   సాల్ట్, బేకింగ్ పౌడర్  వేయాలి. పిండి ని ఒక  సారి కలిపి ,కరిగిన గోరువెచ్చని నెయ్యిని   కూడా  వేసి  పిండి ని బాగా కలుపుకోవాలి.  తరువాత  కొంచెం కొంచెం వాటర్ వేసుకొని  చపాతీ పిండి లాగా కలిపి మూతపెట్టి  1/2 గంట ఉంచాలి. తరువాత పిండిని  ఒకసారి కలిపి  చిన్న చిన్న ఉండలుగ  చేసుకొని మధ్యలో చిన్నగా నొక్కి ప్రక్కన పెట్టుకోవాలి.   మూకుడులోఆయిల్ వేసి
స్టవ్  మీద పెట్టి  కాగాక  స్టవ్  ఆఫ్ చేసి   ఆయిల్ కి సరిపడ  పైన ఉండాలని  వేసి కాసేపటి తరవాత స్టవ్ వెలిగించి చిన్న మంట  మీద  వేయించాలి వేగాక తీసి పాకం లో వెయ్యాలి. పాకం పట్టినది అనుకోగానే  తీసి ప్లేట్ లో పెట్టాలి.


Friday, May 17, 2019

Babycorn Cashew Curry

బేబీకార్న్  జీడిపప్పు  కర్రీ 

కావలసిన వస్తువులు    :

బేబీకార్న్                   :  200 గ్ర ( కావలసిన షేప్ లో కట్ చేసుకోవాలి)
జీడిపప్పు                   :  3 స్పూన్స్ ( కొంచెం)( వేడినీటిలో కాసేపు ఉంచి  మిక్సీ చెయ్యాలి)
ఉల్లిపాయ                 :  1 ( కట్ చేసి మిక్సీ  పట్టాలి)
టొమాటోస్                :   2 ( స్టవ్ మీద బౌల్ లో వాటర్ వేసి  వేడి ఎక్కాక టొమాటోస్ వేసి 5 నిమిషాలు ఉంచి   స్కిన్ తీసి మిక్సీ చేసి ఉంచాలి)
పర్చిమిర్చి                :   3( చీలికలుగా కట్ చెయ్యాలి)
 అమూల్ బట్టర్        :  2 స్పూన్స్ 
జీరాపొడి                    :  1 స్పూన్               
కరివేపాకు                 :  2 రెబ్బలు
కొత్తిమీర                    :  కొంచెం
అల్లం వెల్లుల్లి పేస్ట్  :  2 స్పూన్స్
ఆయిల్                     :  4 స్పూన్స్
కారం                         :  1 1/2 స్పూన్స్
పసుపు                       :  1/2 స్పూన్
సాల్ట్                          : 2 స్పూన్స్  లేదా సరిపడినంత
గరం మసాలా           :  1 1/2 స్పూన్స్

తయారుచేయువిధానము      :

ముందుగా స్టవ్ మీద  పాన్ పెట్టి  అమూల్ బట్టర్  వేసి  బేబీకార్న్ ని వేయించి  ఒక ప్లేట్ లోకి తీసిఉంచాలి. అదే పాన్లో  ఆయిల్ వేసి కాగాక ఉల్లి పేస్ట్  వేసి  కరివేపాకు  పర్చిమిర్చి,అల్లం వెల్లుల్లి పేస్ట్ , సాల్ట్  , పసుపు వేసి తిప్పి,    టమాటో పేస్ట్  వేసి కాసేపు మూత  పెట్టి, కాసేపటికి మల్లి  మూత  తీసి  కారం  జీరాపొడి, గరంమసాలాకూడావేసి    వేసి  బేబీకార్న్ వేసి తిప్పి ,  వేగాక  జీడిపప్పు పేస్ట్ వేసి తిప్పి కొత్తిమీర కూడా వేసి తిప్పి, బౌల్ లోకి తీసుకోవాలి.


Monday, May 13, 2019

KoramenuFish Pulusu

కావలసిన వస్తువులు     :

కొరమేను  చేప ముక్కలు   :  1/2 కేజీ ( సుబ్బరంగా  పసుపు సాల్ట్ తో కడిగి ఉంచాలి )
అల్లం వెల్లుల్లి పేస్ట్            :  2 స్పూన్స్
కారం                                   :  3 స్పూన్స్
సాల్ట్                                    :  సరిపడ
జీలకర్ర పిడి                      :  1 స్పూన్
గరం మసాలా                    :   1 1/2 స్పూన్
చింతపండు                      :   పెద్ద  నిమ్మకాయ సైజు నానబెట్టి రసం తీసి ఇంచాలి
కొత్తిమీర                             :  2 రెబ్బలు
కొత్తిమీర                             :  కొంచెం కట్ చేసి ఉంచాలి
పసుపు                                :  1 స్పూన్
ఉల్లిపాయలు                     :  2 (  1 సన్నగా కట్ చేసుకోవాలి,1 మిక్సీ పట్టాలి.)
పర్చిమిర్చి                         :  5 ( పొడవుగా కట్ చేసి ఉంచాలి)
టొమాటోస్                          :  2  ( 1 సన్నగా కట్ చేసుకోవాలి   1 మిక్సీ  పట్టాలి)
కొబ్బరిముక్క                      :  1 చిన్నది ( ఇది కూడా మిక్సీ పట్టి ఉంచాలి)
ఆయిల్                               :   5 స్పూన్స్

తయారుచేయువిధానము   :


( ముందుగా  చేప ముక్కలికి( సాల్ట్, కారం, పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,కొంచెం గరం మసాలా ,కొంచెం జీరాపొడి   కలిపి ఉంచాలి .) చేపముక్కల   గిన్నె ఉంటే  అది స్టవ్  వెలిగించి  స్టవ్ మీద  పెట్టాలి. లేదా  మూకుడు  పెట్టుకోవాలి.  ఆయిల్ వేసి కాగాక ఉల్లిపాయలు,పర్చిమిర్చి  వేసి కరివేపాకు  రెబ్బలు  వేసి, మిగిలిన  సాల్ట్ , పసుపు ,మిగిలిన  అల్లం వెల్లుల్లి పేస్ట్,  కారం,కూడా వేసి బాగా తిప్పాలి.  కాసేపటి తరవాత   మిక్సీ పట్టిన ఉల్లిపాయలు, టమాటో పేస్ట్ వేసి, తిప్పి  మిగిలిన  జీరపొడి, మిగిలిన  గరం మసాలా కూడా వేసి , (కొబ్బరి వెయ్య వొచ్చు లేదా వెయ్యక పోయిన పర్వాలేదు. )   తిప్పాక   చేప ముక్కలిని గిన్నెలో  పేర్చాలి. గిన్నెని కొంచెం తిప్పి కాసేపటి తరవాత చింత పండు పులుసు వెయ్యాలి పులుపు కూడా మధ్యలో చూసుకోవాలి. లేదంటే ఇంకా కొంచెం బాగా పిసికి చింత పండు పులుసు తీసి  వెయ్యాలి. కొంచెం ఉడికాక చిన్న మంట  పెట్టి, కొంచెం కోతి మీర చల్లి  మూతపెట్టాలి.   10 మినిట్స్ లో కూర ఐపోతుంది. మూత  తీసి  చూస్తే ఆయిల్ తేలుతుంది . అది చూసి  మిగిలిన కొత్తిమీర చల్లి స్టవ్  ఆఫ్ చెయ్యాలి . కూర వేడి తగ్గాక  తింటే  పులుసు చాల టేస్ట్ గ ఉంటుంది. 


 





Wednesday, May 8, 2019

Endu Chepalu Chukka Koora

కావలసిన వస్తువులు    :

ఎండుచేపలు          :   4 లేదా 5 ( 2 నిమిషాలు  వాటర్ లో వేసి కడిగి ఒక బౌల్ లోకి తీసుకోవాలి)
చుక్కకూర               :    4 కట్టలు ( సుబ్బరంగా కడిగి కట్ చేసి ఉంచాలి)
ఉల్లిపాయలు          :    2( కట్ చేసి ఉంచాలి)
టొమాటోస్               :  2 (కట్ చేసి ఉంచాలి )
పర్చిమిర్చి               :   2  (కట్  చేసి ఉంచాలి)
ఆయిల్                    :    3 స్పూన్స్
కా రం                       :    1 స్పూన్
సాల్ట్                         :  సరిపడా
పసుపు                     :  1/2 స్పూన్
  అల్లం                     :  1/4 స్పూన్ తరిగినది
వెల్లుల్లి                     :   4 రెబ్బలు   తరిగినట్లు

తయారుచేయువిధానము     :

ముందుగా స్టవ్ మీద  మూకుడు పెట్టి  ఆయిల్ వేసి  కాగాక ఉల్లిపాయలు  వేసి,
సాల్ట్, పసుపు వేసి  కాసేపు తిప్పాలి.  అల్లం వెల్లుల్లి  వేసుకోవచ్చు లేదా వెయ్యక పోయిన పర్వాలేదు ,అప్పుడు  ఎండు చేప ముక్కలు  వేసి కాసేపు వేగ నివ్వాలి. టొమాటోస్ వేసి,  కారం  వేసి కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం  మగ్గింది  అనుకోగానే  చుక్కకూర వేసి  తిప్పి,   చిన్నమంట 
మీద  పెట్టి  ఉంచాలి . మధ్య మధ్యలో  కూర చూసుకుంటూ  జాగర్త గా  తిప్పాలి . కూర దగ్గరికి అయి పోగానే  కొంచెం కొత్తిమీర చల్లి  బౌల్ లోకి తీసుకోవాలి .  ఎండు చేప వాసన  చుక్క కూరకి  ,
చుక్కకూర  ఎండుచేపకి  పట్టి కూర చాల చాల టెస్ట్ గ  ఉంటుంది. మల్లి మల్లి చేసుకొని తినాలి  అని అనిపిస్తుంది. 


Tuesday, May 7, 2019

Dibba Rotti

కావలసిన వస్తువులు      :

మినపప్పు              :  1 గ్లాస్
బియ్యపు రవ్వ       :  1 1/2 గ్లాస్
ఆయిల్                  : 5 స్పూన్స్


ముందుగా  మినపప్పుని  ఒక బౌల్ లో, బియ్యపు రవ్వని  1 బౌల్ లోకి  వాటర్ పోసి   5  గంటలు  నాన బెట్టాలి.  మినపప్పుని  వాటర్ వేసి మిక్సీ  పట్టి  దానిని ఒక బౌల్ లోకి తీసుకొని  దానిలోకి బియ్యపు రవ్వని గట్టిగ పిండి  సాల్ట్ వేసి ,కలిపి  5 లేదా 6  గంటలు ఉంచాలి . కొంచెం పొంగి నట్టు వస్తుంది.   మూకుడు పెట్టి  ఆయిల్ వేసి పిండి ని ఎంత కావాలో అంత వేసి  మూత పెట్టి సన్నటి సెగ మీద  10 నిమిషాలు  ఉంచాలి.  మూత  తీసి చూసుకోవాలి. ఫై భాగము కూడా అంటుకోకుండా  ఉడికినట్టు అవ్వగానే  తిరగ వేసి మూత  పెట్టి మల్లి కాసేపు ఉంచాలి.   ఈ దిబ్బ రొట్టి   కొబ్బరి  చట్నీ తో  తింటే చాల బాగుంటుంది.