Tuesday, April 23, 2019

Pala munjelu

కావలసిన వస్తువులు     :

సెనగపప్పు              :  1 గ్లాస్ ( 100గ్ర)
బెల్లం                       :  1 గ్లాస్( 100గ్ర)
యాలకుల పొడి      :  2 స్పూన్స్
బొంబాయి రవ్వ       :  1 గ్లాస్
పాలు                        :   2 గ్లాస్ ( 1 గ్లాస్ పాలు అండ్  1 గ్లాస్ వాటర్ అయినా  వెయ్యవోచ్చు)
ఆయిల్                     :  1/2 కేజీ

  తయారుచేయువిధానము      :

ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో   ( 1 గ్లాస్ సెనగపప్పు కి 2 1/2 గ్లాస్ వాటర్ వేసి ) 4 లేదా 5 విజిల్స్  వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి . కుక్కర్ మూతవచ్చాక   దానిలో బెల్లం వేసి మెత్తగా మెదపాలి.
కాసేపు స్టవ్ మీద తిప్పుతూ ఉంటే  దగ్గరకి అవుతుంది. అప్పుడు యాలకుల పొడి వేసి తిప్పి ప్రక్కన పెట్టాలి. వేరొక  మూకుడులో  పాలు,బొంబాయి రవ్వ కలిపి స్టవ్ మీద పెట్టి చిటెకెడు సాల్ట్ వేసి తిప్పుతూ  దగ్గరకి అయ్యేదాకా తిప్పుతూనే ఉండాలి. కొంచెందగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి
కొంచెం వేడి తగ్గా క  ప్రక్కన పెట్టాలి.  ముందుగా సెనగపప్పు ముద్దలని  చిన్న  ఉండలుగా చేసి ఒ క   ప్లేటులో పెట్టుకోవాలి. ముందుగా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని  బొంబాయి రవ్వ చిన్న ఉండతీసుకొని పలచగా చేసి దాని మధ్యలో సెనగపప్పు ఉండని   పెట్టి పలచగా చేసిన బొంబాయి రవ్వ ని   కవర్ చేసి పూర్ణం లాగా రౌండ్ గ చెయ్యాలి . ఈలోపు స్టవ్ వెలిగించి  గిన్నెలో ఆయిల్ వేసి  కాగాక జాగర్తగా   ఒ క్కోక్కటి     వేసి ఒకదానికి ఒకటి  తగలకుండా వెయ్యాలి.లేదా ఒక్కొక్కటి వేసి వేగాక తీసుకోవాలి.   ఇవి    చాల   బాగుంటాయి.

No comments:

Post a Comment