Tuesday, April 30, 2019

uttapam

కావలసిన వస్తువులు     :

దోసలపిండి               :   1 బౌల్
సాల్ట్                           : సరిపడ
ఆనియన్స్                :  1 సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి                :  2 సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి
అల్లంతరుగు            :   కొంచెం
జీలకర్ర                     :  1 స్పూన్
ఆయిల్                     :  కొంచెం

తయారుచేయువిధానము     :

ముందుగా   స్టవ్ వెలిగించి  పెనం పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి కాగాక అట్టు పిండి  వేసి  దానిమీద  ఆనియన్స్ చల్లి , పర్చిమిర్చి  కూడావేసి, దాని మీద జీలకర్ర వేసి ,కొతిమీరవేసి మూత పెట్టాలి. 5 నిమిషాల తరువాత  రెండవ వైపు తిప్పి  మల్లి కాసేపు ఉంచి తియ్యాలి .. ఊతప్పం  కొబ్బరి చట్నీ తో తింటే  చాల బాగుంటుంది.


Monday, April 29, 2019

Potli Sweetcorn Samosa

కావలసినవస్తువులు    :

మైదా                :  200గ్ర
ఆయిల్            :   4 స్పూన్స్
సాల్ట్                 : 1/2స్పూన్ ( సరిపడా)
పొటాటోస్        : 1/4 కేజీ ( కూకర్లో వాటర్ వేసి,పొటాటోస్ వేసి  వాటిని 4లేదా 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచి కట్టెయ్యాలి ,  చల్లారాక  వాటి ఫై పోరని  తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
స్వీట్ కార్న్      : 1 కప్
ఆనియన్         :  1 ( సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి       : 3 ( సన్నగా కట్ చేసుకోవాలి)
కారం                 : 1 1/2 స్పూన్
పసుపు              :  1/2 స్పూన్
సోంపు               : 1 1/2 స్పూన్
జీలకర్ర            ;  1 స్పూన్
ఆంచూర్ పొడి   :  1 స్పూన్
చాట్ మసాలా    :  1 స్పూన్
గరంమసాలా     :  1 స్పూన్
ధనియాలు        :  1 స్పూన్ ( కొంచెం చేతితో నలపాలి)
కొత్తిమీర             :  కొంచెం
అల్లం                 : 1/4 స్పూన్( తరిగినది)
ఆయిల్              :  4 స్పూన్స్
ఆయిల్              : 1/4 కేజీ ( సమోసా వేయించడానికి)

తయారుచేయువిధానము       :


ముందుగా  మైదా ని  జల్లించి  ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దానిలోకి సాల్ట్, ఆయిల్ వేసి( 4 స్పూన్స్) బాగా కలిపి చేతితో గట్టిగ పట్టుకుంటే  ఉండాలా గ  రావాలి.  అప్పుడు కొంచెం కొంచెం 
వాటర్ వేసి  చపాతీ పిండిలాగా  గట్టిగ కలుపుకోవాలి. మూత  పెట్టి  1/2 గంట వొదిలేయాలి. 
ఈలోపు   స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి ( 4 స్పూన్స్) ఆవాలు , జీలకర్ర,సోంపు, ధనియాలు, అల్లం, ఆనియన్స్,పర్చిమిర్చి, స్వీటీకార్న్,సాల్ట్,పసుపు వేసి ,కొంచెంవేగాక  పొటాటో  వేసి కొంచెం తిప్పాక  కారం,చాట్ మసాలా  ,ఆంచూర్ పొడి,  గరం మసాలా , లాస్ట్ లో కొత్తిమీర  వేసి కాసేపు తిప్పి ప్రక్కన పెట్టుకోవాలి. 
ఇప్పుడు మైదా మీద   మూత  తీసి  పిండిని బాగా కలిపి చిన్న చిన్న  ఉండతీసుకొని  చపాతీ లాగా చేసి  మధ్యలో పైన ఆరిన కూరని పెట్టి కూర చుట్టూ  కొంచెం చెయ్యి తడి చేసి చుట్టూ రాయాలి. చపాతి అంచులు పట్టు కొని  మెల్లి మెల్లిగా ఫోల్డ్ చేస్తూ  మొత్తం చుట్టూ చెయ్యాలి చేసాక ఫోల్డ్ చేసిన భాగాన్ని కొంచెం పట్టుకొని గట్టిగ  నొక్కాలి. కూర చుట్టూ వాటర్ రాసమ్  కాబట్టి మనం నొక్కినప్పుడు  అక్కడ అతుకుంటుంది.  పైన పువ్వులాగా వస్తుంది.  అన్నింటిని  అట్లా చేసి  స్టవ్ మీద  మూకుడు పెట్టి  ఆయిల్ వేసి (1/4కేజీ) సమోసాలని 4 లేదా 5 చొప్పున  సన్నటి సెగ మీద వేసి వేయించుకోవాలి.  అట్లా  తిన్నా   బాగుంటాయి,లేదా టమాటో కెచప్  తో కొందరు తింటారు. అది  కూడా బాగుంటుంది. 






Beerakaya Kobbari Roti Pachhadi

కావలసినవస్తువులు    :

బీరకాయలు       : 1/2 కేజీ ( కొంచెం పీల్ చేసి కట్ చేసి ఉంచుకోవాలి)
పర్చిమిర్చి          :  8 లేదా 10( కారాన్ని బట్టి )
కొబ్బరి                 :  4 చిన్న ముక్కలు
వెల్లుల్లి                :   10 రెబ్బలు
జీలకర్ర               :  1 1/2 స్పూన్
చింతపండు       :   చిన్ననిమ్మకాయలో సగం
సాల్ట్                    : సరిపడ
ఆయిల్               : 4 స్పూన్స్
కొత్తిమీర              :  ఒక  కట్ట ( కడిగి సన్నగా కట్ చేసుకోవాలి)

తయారుచేయువిదానము    :


ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి   బీరకాయ ముక్కలు ,ఆయిల్ పర్చిమిర్చి వేసి , వేగనివ్వాలి, వేగిన వెంటనే కొబ్బరి,వెల్లుల్లి, జీలకర్ర,చింతపండు , కొత్తిమీర వేసి  కాసేపు తిప్పి స్టవ్ ఆఫ్ చేసి ,చల్లారాక ముందుగా మిక్సీలో  కొబ్బరిముక్కలు వేసి గ్రైండ్ చేసాక మిగిలినవి వేసి సాల్ట్ వేసి మిక్సీపట్టాలి .  దానిని బౌల్ లోకి తీసుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్లు ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి కలుపుకోవచ్చు 

Gunta Pongadalu

కావలసినవస్తువులు     :

దోసెలా  పిండి            :  1 పెద్ద కప్
ఆనియన్స్                  :  1( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి                  :   3 ( సన్నగా, చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి)
కొత్తిమీర                      :   కొంచెం
సాల్ట్                            :   సరిపడ


తయారుచేయువిధానము    :

ముందుగా   ఒక బౌల్ లోకి దోసలపిండి,ఆనియన్స్,పర్చిమిర్చి కొత్తిమీర, సాల్ట్, అన్నీకలిపి రెడీ గ ఉంచుకోవాలి.  పొంగడాలు వెయ్యడానికి  గుంట లుగా  ఉన్నది  ఇనపది కానీ,నాన్ స్టిక్ 
కానీ  మార్కెట్లో  దొరుకుతుంది .  దానిలో కొంచెం ఆయిల్ వేసి అన్ని గుంటలకి   చేతితో ఆయిల్ రాయాలి . దానిని స్టవ్  మీద పెట్టి ఆ గుంటలలో పిండి ని వేయాలి. పైన మూత పెట్టాలి. 5 నిమిషాలలో స్పూన్ తో వాటిని జాగర్తగా తిరగవేయాలి. మల్లి మూత పెట్టి  4 నిమిషాలలో అన్నింటిని ప్లేటులోకి తీసుకోవొచ్చు.  

గమనిక   

 దోసెల  పిండి కి కొలతలు   1 గ్లాస్ మినపప్పుకి, 2 గ్లాసుల రైస్   విడివిడిగా  నానబెట్టి 6 గంటలతరవాత  ముందు మినపప్పు మిక్సీ  పట్టి  తీసి,తరువాత  బియ్యం కొంచెం రుబ్బిన మినపప్పు కొంచెం వేసి రుబ్బితే  మెత్తగా పిండి వస్తుంది. మల్లి మిగిలిన బియ్యం  రుబ్బిన మినప పిండి  కలిపి మల్లి మిక్సీ చేస్తే  సరిపోతుంది. లేదా వెట్ గ్రైండర్లో రెండూ కలిపి వేసిన గ్రైండ్ అవుతుంది.     


Beet Root roti pachhadi

కావలసిన వస్తువులు     :

బీట్రూట్                         :   2 ( పీల్ చేసి  కట్ చేసి ఉంచాలి)
ధనియాలు                     :  2 స్పూన్స్
సెనగపప్పు                     :  2 స్పూన్స్
మినపప్పు                       :  1 స్పూన్
ఎండుమిరపకాయలు   :    7 లేదా  8
వెల్లుల్లి                           :  7 లేదా 8 రెబ్బలు
చింతపండు                  :  కొంచెం ( చిన్న నిమ్మకాయ కన్నా తక్కువ)( గోరువెచ్చటి  వాటర్ లో నానబెట్టాలి)
సాల్ట్                               :  సరిపడ
ఆయిల్                          : 2 స్పూన్స్


తయారుచేయువిధానము    :

ముందుగా   స్టవ్  వెలిగించి  మూకుడు పెట్టి  1 స్పూన్ ఆయిల్ వేసి సెనగ పప్పు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర 1 స్పూన్ , ఎండుమిర్చి  వేయించి, మిక్సీపట్టి  ఉంచాలి . ఈలోపు  వేరే  మూకుడు  స్టవ్ మీద పెట్టి  బీట్రూట్  ముక్కలు  2 స్పూన్స్  ఆయిల్ వేసి  వేయించాలి.     వేగాక వెల్లుల్లి కూడా వేసి కాసేపు తిప్పి  , చింతపండు, సాల్ట్  వేసి కొంచెం చింతపండులో వాటర్ కూడా వేసి మిక్సీ పట్టి  ,  దానిలో పైన మిక్సీ చేసిన పొడిని కలపాలి.  సాల్ట్ చూసుకొని చాలకపోతే
కొంచెం  వేసి ,కొంత మంది తాలింపు వేసు కుంటారు. నేను వెయ్యలేదు. 



Sunday, April 28, 2019

Prawns Curry

కావలసిన వస్తువులు    :

రొయ్యలు                   :  1/2 కేజీ  ఒలిచిన   రొయ్యలు ( నీట్ గ కడిగి ఉంచుకోవాలి)
ఆనియన్స్                :   1 పెద్దది ( చిన్న ముక్కలు చేసుకోవాలి)
పర్చిమిర్చి                :  2 (చీలికలిగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్  : 2 స్పూన్స్
జీడిపప్పు                  :   2 స్పూన్స్
కారం                        : 1 1/2 స్పూన్
సాల్ట్                        :   1 స్పూన్
పసుపు                    :  1/2 స్పూన్
ఆయిల్                  :   4  స్పూన్స్
గరం మసాలా        :  1 1/2 స్పూన్
 కొత్తిమీర                :   1 పెద్ద కట్ట ( కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి)
టమాటో                :  1 ( చిన్నగా కట్ చేసుకోవాలి)



తయారుచేయువిధానము      :

ముందుగా  స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి  ఆయిల్   వేసి  కాగాక ఆనియన్స్ వెయ్యాలి . పర్చిమిర్చి  ,పసుపు, సాల్ట్,  జీడిపప్పు , అల్లం వెల్లుల్లి పేస్ట్,రొయ్యలు  ,టొమాటోస్,ఒక దానితరవాత  ఒకటి కొంచెం గ్యాప్ లో వెయ్యాలి.     కొంచెం వేగాక  సన్నటి సెగ మీద పెట్టి మూతపెట్టాలి.  కాసేపటికి వేగిపోతుంది. రొయ్యవుడికింది  అనగానే  గరం మసాలా వేసి, కొత్తిమీర కూడా వేసి  కొంచెం దగ్గరికి అవ్వగానే  ఆయిల్ తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చెయ్యాలి.


Royyala Biriyani


కావలసిన వస్తువులు     :

రొయ్యలు                     :   1/2 కేజీ    ఒలిచినవి  ( బాగుచేసుకొని ఉంచాలి )
ఆనియన్స్                  :    2 ( కట్ చేసిఉంచాలి)
పర్చిమిర్చి                  :    4 ( పొడవుగా చీలికలు చేసి ఉంచాలి)
టమాటో                       :   2 ( పొడవుగా చీలికలు చేసి ఉంచాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్    :    3 స్పూన్స్
గరంమసాలాపొడి       :    3 స్పూన్స్
కా రం                           : 1 1/2 స్పూన్స్ ( కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు)
సాల్ట్                             :  1 1/2 స్పూన్స్( సాల్ట్ చూసి మల్లి వేసుకోవొచ్చు)
పసుపు                         :   1 స్పూన్
పొదీనా                         :  3 కట్టలు ( ఆకు తీసి కడిగి ఉంచాలి)
కొత్తిమీర                       :   2 కట్టలు   ( ఆకు తీసి కడిగి ఉంచాలి)
బాసుమతి రైస్            :  1/2 కేజీ  (  బిరియాని చేసే  ముందు అర గంట ముందు నానబెట్టాలి)
మసాలాలు                  : లవంగాలు 4, యాలకులు 4, దాచినచెక్క  2  చిన్నవి,మరటిమొగ్గ 1, అనాసపువ్వు  1, బిరియాని ఆకు 3

నెయ్యి                          :  4 స్పూన్స్
ఆయిల్                        : 3 స్పూన్స్

తయారుచేయువిధానము    :


 ముందుగా  ఒక  గిన్నెలో  వాటర్ వేసి  ఒక స్టవ్ మీద పెట్టాలి.  ఇంకొక స్టవ్ మీద బిరియానికి గిన్నె పెట్టి దానిలో నెయ్యి, ఆయిల్ కూడా వేసి కాగాక మసాలాదినుసులు ( లవంగాలు యాలకులు దాచినచెక్క  అవి) వెయ్యాలి .  తరవాత ఆనియన్స్ వేసి, పర్చిమిర్చి  వేసి,
అల్లం వెల్లుల్లి పేస్ట్,బిరియాని ఆకు, సాల్ట్ , పసుపు,  టమాటో,ఒక దాని తరువాత ఒకటి కొంచెం గ్యాప్ లో వెయ్యాలి.  కా రం , రొయ్యలు కూడా వెయ్యాలి. కాసేపుతిప్పుతూఉండాలి.  ఈలోపు పైన మరుగుతున్న గిన్నెలో బాసుమతి బియ్యంవేసి,కొంచెం సాల్ట్ కొంచెం పొదీనా , ఇంకా సోంపు 1 స్పూన్  కూడా వేసి  రైస్  ఉడకనివ్వాలి . రైస్ లో సాల్ట్ సరి పోయిందో లేదో చూసుకోవాలి.   ఈలోపు రొయ్యలలో మసాలా కూడా వేసి తిప్పుతూ ఉండాలి. పైన రైస్ పట్టి చూడాలి , 75% ఉడికింది  అనగానే  కన్నాల   గరిటతో రైస్ ని తీసి నీరు పోయాక   రైస్ ని   రొయ్యలమీద  పరవా లి.  అక్కడ నుండి రైస్ ని వెంటవెంటనే  గరిటతో తీసి నీరు లేకుండాచూసి  వడకట్టుకుంటూ   కూర మీద మొత్తం  పరవాలి.  (రైస్ ని కొంచెం  ఫాస్ట్ గా  పరవా లి.)   రైస్ మీద  అమూల్ బట్టర్ ని  కొంచెం తీసుకొని  చిన్న చిన్న ముక్కలుగా  చేసి  అక్కడక్కడా  పెట్టి ,  గ్లాస్ లేదా మామూలు మూతని పెట్టి  ఆవిరి పోకుండా   ఒక నాప్కిన్ ని  మంటకి తగలకుండా పైన లిడ్ మీద ఉంచాలి. 8 నిమిషాలలో  రొయ్యలబిరియాని రెడీ.  గరిటతో  అడుగునుండి పైకి  రైస్ ని కూరతో పా టు  తిరగవేయ్యాలి. 















Saturday, April 27, 2019

Ravva Dosa

కావలసిన వస్తువులు    :

మైదా                   :  1/2 కప్
బియ్యం పిండి   :   1 కప్
బొంబయి రవ్వ  :  2 కప్స్
క్యారెట్                :   1 చిన్నది ( కోరివుంచాలి)
పర్చిమిర్చి          :  2( చిన్నగా కట్ చేసి ఉంచాలి)
జీలకర్ర               :  1/4 స్పూన్
అల్లం                  : చిన్నది( బాగా సన్నగా కోరి ఉంచాలి)
సాల్ట్                    :  1 స్పూన్ ( చూసి వేసుకువాలి)
కొత్తిమీర               :  కొంచెం సన్నగా కట్ చేసి ఉంచాలి)
ఆయిల్                : కొంచెం (దోసమీద వెయ్యడానికి)

తయారువిధానము   :

ముందుగా బౌల్ లోకి పైన ఐటమ్స్ అన్నిటిని కలిపి  కొంచెం వాటర్ వేసి  పలచగా కలుపుకోవాలి దోసలపిండి కన్నా బాగా పలచగా కలుపుకో వాలి.   స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి పల్చగా గరిటతోకాని , కప్ తో కానీ పల్చగా వెయ్యాలి . పైన కొంచెం ఆయిల్ వెయ్యాలి. ముద్దగా
గనక వస్తే  మరి కొంచెం వాటర్ వేసి మల్లి వెయ్యాలి. ఫస్ట్ టైం ఐతే కొంచెం రావడం కష్టం.  1 కానీ 2 కానీ వేస్తే  మీకే తెలిసిపోతుంది. లేదా వీడియో చూడండి.  ఒక సా రి వస్తే  ఇంకా ఈజీ గ వచ్చేస్తుంది . ట్రై చెయ్యండి. ఆనందంగా తినండి. .



Maida variety samosalu


కావలసినవస్తువులు      :

మైదా              :    200గ్ర    ( జల్లించి ఉంచాలి)
సాల్ట్               :    1/2 స్పూన్
నెయ్యి            :    3 స్పూన్స్
వామ్ము           :     2 స్పూన్స్
వాటర్            :     కొంచెం

తయారీవిధానము   : ముందుగా ఒక  బౌల్ లో మైదా, సాల్ట్ ,  వామ్ము,  నెయ్యి,  వేసి  బా గాచేతితో  కలపాలి . నెయ్యి బాగా కలిసాక  కొంచెం ,కొంచెం  వాటర్ వేసి   కొంచెం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దానిమీద గట్టిగ  పిండిన కాటన్ బట్ట  కప్పి కాసేపు ఉంచాలి. తరవాత పిండిని బాగా కలిపి  చిన్న చిన్న ఉండలుగా చేసి సమోసాని కొన్ని ఆకారాలలో  చేసుకోవచ్చు.
సమోసా లో కి   సన్నగ  కట్ చేసిన  1 ఆనియన్ , 3  సన్నగా కట్ చేసిన పర్చిమిర్చి  ,కొంచెం  కేరట్  తురుము,  అటుకులు కొంచెం , సాల్ట్ కొంచెం కలిపి ఉంచుకోవాలి. మనకి నచ్చిన ఆకారాలలో చేసి ఆయిల్ లో సన్నటి సెగ మీద  వేయించాలి.  ఇవి టెస్ట్ కి టెస్ట్  మనకి మంచిదికూడా.   ఈవెనింగ్ స్నేక్స్కి   చాల చాల బాగుంటాయి.





Friday, April 26, 2019

Bellam Pongadalu

కావలసిన వస్తువులు          :

బియ్యం                :  1 కేజీ ( 24 గంటల ముందు నానబెట్టి  వడకట్టి నీరు అంత పోయాక మిక్సీ పట్టి మెతగ్గా జల్లించి  ఉంచాలి )
బెల్లం                    :  3/4 కేజీ( దీని ప్రకారం రైస్  బెల్లం వేసుకోవాలి )
యాలకుల పొడి   :  కొంచెం
నెయ్యి                   :  4  లేదా  5 స్పూన్స్
ఆయిల్                 : 1/2 కేజీ
కొబ్బరి కాయ        :   1 ( కోరి కొంచెం నేతిలో వేయించి ఉంచాలి)

తయారుచేయువిధానము    :

బియ్యంపిండి రెడీ  అయిన  వెంటనే   మనం బెల్లం కొబ్బరి పొంగడాలు చేసెయ్యాలి.  ముందుగా  స్టవ్ మీద  గిన్ని  పెట్టి గిన్నెలో బెల్లంవేసి కొంచెం వాటర్ వేసి మరగనివ్వాలి . కాసేపటికి చిన్నగిన్నెలో వాటర్ వేసి దానిలో బెల్లం పాకం కొంచెమువేసి ఉండపాకం లాగా వచ్చేవరకు  చూడాలి. ( చాల జాగర్త గ)  . కొంచెం వాటర్ చిన్న గిన్నెలో తీసుకొని రెడీ గాఉండాలి.  మరగిన పాకం వాటర్ ఉన్న గిన్నెలో వేసి చేతితో కలిపితే  దగ్గరికి అవుతుంది .  అప్పటివరకు  పాకాన్ని తిప్పి చూసుకుంటూ ఉండాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి వేసి , బియ్యం పిండి కొంచెం కొంచెం వేస్తూ గరిటతో తిప్పాలి. యాలకుల పొడి కూడా వెయ్యాలి. మరీ దగ్గరికి ముద్దగా కాకుండా మరీ లూస్  గ కాకుండా ఉండే వరకు పిండి ని వేసి తిప్పాలి. ఈలోపు కొంచెం వాటర్ ని మరిగించి గోరువెచ్చగా  ఉన్నప్పుడు   ఆనీళ్ళని   పైన పిండి లో వేసి గరిట జా రుగ కలపాలి . అదికూడా  ఆయిల్ లో  వేసినప్పుడు మరి పాకకుండా ఉండే టట్టు గ    వెయ్యాలి . స్టవ్  మీద మూకుడు పెట్టి  ఆయిల్ వేసి మరిగాక గుంట గరిటతో  ఒక్క గరిట తో పిండి తీసి  మద్యలో  వెయ్యాలి. 2 నిమిషాలలో  పైకి పొంగుతూ వస్తుంది . అప్పుడు రెండవ  వైపు  తిప్పాలి.
అట్లా అన్నీ  ఒకొక్కటి వేసి మంచి కలర్ గ  ఉడికేటట్టు వేసుకోవాలి. ఇవి చాల టేస్టుగా  చాలరుచిగా,చాలారోజులు నిల్వ కూడా ఉంటాయి.  బెల్లం కాబట్టి ఆరోగ్యానికి  కూడా  మంచిది.

గమనిక   :    దీనిలో కొంచెం కొబ్బరి,  కొంచెం బొంబాయి రవ్వ   కూడా  వేసుకుంటే  కూడా చాల
టేస్ట్  గ కూడా ఉంటుంది. పాకంలో పిండి  వేసే టప్పుడు  ఒక వేళ పిండి మనకి  చాలనప్పుడైనా  బొంబాయి రవ్వ కలుపుకోవచ్చు.  కంగారు పడకూడదు. చాలాబాగుంటుంది.










Maida pindi Sampengalu,Panasathonalu,Gulabeelu

కావలసినవస్తువులు       :

మైదాపిండి              :   1/2 కేజీ
సాల్ట్                         :  1 చిటెకెడు
పంచదార                :   1/2 కేజీ
యా లుకలపొ డి     :  1 స్పూన్
వాటర్                      :  కొంచెం

తయారుచే యువిధానము       :

 1.
ముందుగా   స్టవ్ వెలిగించి  గిన్నెలో పంచదార వేసి కొంచెం వాటర్ వేసి  పెట్టాలి.  అదికరిగాక
 లేతపాకం వచ్చాక  స్టవ్ ఆఫ్ చేసి అది ప్రక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ లోకి మైదా వేసి , సాల్ట్ వేసి , కొంచెం కొంచెం వాటర్ వేసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. బాగా కలిపాక పిండి వేసుకొని  చిన్న చపాతీ  లాగా చేసుకొని , చపాతీకి మధ్యలో చివరలు కట్ అవ్వకుండా కత్తి తో గాటు  పెట్టాలి.  అక్కడనుండి చివరివరకు కట్ చేసుకోవాలి. .ఆచివరనుండి మడతపెట్టి
రెండు అంచులు కలిపి ప్రెస్ చేసి పైకి తీస్తే  పనసతొనలగా వస్తుంది. దానిని ఆయిల్ లో ఒకొక్కటి వేయించి పాకం లో వేసి అటుఇటు తిప్పి ముంచి తీసెయ్యాలి.
 2.
  అట్లాగే  పెద్దచపాతి చేసి పెద్ద మూతవి 2 రెండు , దానికన్నా చిన్న మూతవి ఒకటి  కట్ చెయ్యాలి. కింద పిండి వేసి పెద్దరౌండ్  చపాతీ పెట్టి , దాని మీద కొంచెం పిండి వేసి ఇంకొక పెద్ద రౌండ్ చపాతీ పెట్టి, దాని మీద  పిండి వేసి దానిమీద చిన్న చపాతీ  పెట్టి మధ్యలో కొంచెం వేలితో నొక్కి ఉంచాలి. పెద్దచపాతీలో పైన మూడు చపాతీలు తీసాక సైడ్ ముక్కలని  చిన్న పీసిని  కొంచెంపొడవుగా  కట్ చేసి రౌండ్ గ  చుట్టాలి. అది గులాబీకి మధ్యలో బడ్ లాగా ఉందికదా .దీనిని పైన ఒకదాని మీద ఒక చపాతీలు 3 పెట్టాము కదా దాని మధ్యలో కొంచెం తడి చేసి పెట్టాలి .అప్పుడు మూడు చపాతీలా మధ్య దానిని పెట్టాక  ఆ చపాతీని సమానంగా 3 పీసెస్  అయ్యాటట్టు గ 2 చోట్ల  కట్ చెయ్యాలి.   ఒక పొరకి కొంచెం తడి చేసి బడ్ చుట్టూ  తిప్పి
 అం టించాలి.    అట్లాగే  ఒక  దాని తరవాత ఒకటి పెట్టి రెక్కలుగా  చెయ్యాలి  అది గులాబిలాగా వస్తుంది .
3. 
అట్లాగే   ఒక చపాతీ చేసి దానిని  4  బాగాలుగ  చేసి  ఒకొక్క భాగాన్ని సైడ్ నుండి దగ్గరికి చేతితో ప్రెస్ చేస్తాము.  నాలుగు రెక్కలుగా వస్తుంది. రెండు రెక్కలని ప్రక్క ప్రక్క పెట్టి కింద చేతితో కలిపి ,అట్లాగే మిగిలిన రెం డు రెక్కలని కూడా  కలపాలి. రెండు రెండు రెక్కలని  రివర్స్ లో కలిపి  నాలుగు భాగాలని కలిపి ప్రెస్ చెయ్యాలి  ఆయిల్ లో వెయ్యగానే సంపెంగలులాగా పొంగుతాయి. వాటిని పాకంలో వేసి తిప్పి వెంటనే  తియ్యాలి 










Tuesday, April 23, 2019

Pala munjelu

కావలసిన వస్తువులు     :

సెనగపప్పు              :  1 గ్లాస్ ( 100గ్ర)
బెల్లం                       :  1 గ్లాస్( 100గ్ర)
యాలకుల పొడి      :  2 స్పూన్స్
బొంబాయి రవ్వ       :  1 గ్లాస్
పాలు                        :   2 గ్లాస్ ( 1 గ్లాస్ పాలు అండ్  1 గ్లాస్ వాటర్ అయినా  వెయ్యవోచ్చు)
ఆయిల్                     :  1/2 కేజీ

  తయారుచేయువిధానము      :

ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో   ( 1 గ్లాస్ సెనగపప్పు కి 2 1/2 గ్లాస్ వాటర్ వేసి ) 4 లేదా 5 విజిల్స్  వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి . కుక్కర్ మూతవచ్చాక   దానిలో బెల్లం వేసి మెత్తగా మెదపాలి.
కాసేపు స్టవ్ మీద తిప్పుతూ ఉంటే  దగ్గరకి అవుతుంది. అప్పుడు యాలకుల పొడి వేసి తిప్పి ప్రక్కన పెట్టాలి. వేరొక  మూకుడులో  పాలు,బొంబాయి రవ్వ కలిపి స్టవ్ మీద పెట్టి చిటెకెడు సాల్ట్ వేసి తిప్పుతూ  దగ్గరకి అయ్యేదాకా తిప్పుతూనే ఉండాలి. కొంచెందగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి
కొంచెం వేడి తగ్గా క  ప్రక్కన పెట్టాలి.  ముందుగా సెనగపప్పు ముద్దలని  చిన్న  ఉండలుగా చేసి ఒ క   ప్లేటులో పెట్టుకోవాలి. ముందుగా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని  బొంబాయి రవ్వ చిన్న ఉండతీసుకొని పలచగా చేసి దాని మధ్యలో సెనగపప్పు ఉండని   పెట్టి పలచగా చేసిన బొంబాయి రవ్వ ని   కవర్ చేసి పూర్ణం లాగా రౌండ్ గ చెయ్యాలి . ఈలోపు స్టవ్ వెలిగించి  గిన్నెలో ఆయిల్ వేసి  కాగాక జాగర్తగా   ఒ క్కోక్కటి     వేసి ఒకదానికి ఒకటి  తగలకుండా వెయ్యాలి.లేదా ఒక్కొక్కటి వేసి వేగాక తీసుకోవాలి.   ఇవి    చాల   బాగుంటాయి.

Egg pudding

Monday, April 22, 2019

Palakoora pappu



కావలసినవస్తువులు   :

పాలకూర       : 4 లేదా 5 కట్టలు ( సు బ్బరంగా కడిగి కట్ చేసి ఉంచాలి)
ఆనియన్       :  1 ( చిన్న ముక్కలుగా కట్ చేసిఉంచాలి)
పర్చిమిర్చి     :  2 ( కట్ చేసి ఉంచాలి)
సాల్ట్                :  1 స్పూన్
కారం               :  1 స్పూన్( కావాలంటే   కొంచెం ఎక్కువుగా కూడా వేసుకోవచ్చు)
టొమాటోస్      :  2 లేదా 3 ( కట్ చేసి ఉంచాలి)
పసుపు            "  1 స్పూన్
కందిపప్పు      :  1 చిన్న కప్ ( కడిగి ఉంచాలి)
కరివేపాకు       :  1 రెబ్బ
వెల్లుల్లి            :  4లేదా 5 రెబ్బ లు
నిమ్మకాయ     :  1/2 చెక్క సరిపోతుంది
తాలింపు         :   1  స్పూన్, జీలకర్ర  1 స్పూన్, మినపప్పు 1 స్పూన్
ఆయిల్           :   3 స్పూన్స్



తయారీవిధానము    :

ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి , ఆయిల్ వేసి , వెల్లుల్లి వేసి , తాలింపు , కరివేపాకు కూడా వేసి , ఆనియన్స్ కూడా వేసి, పర్చిమిర్చి కూడా వేసి,  టమాటో ముక్కలు వేసి,తిప్పి పాలకూర కూడా వేసి, సాల్ట్ ,కారం, పసుపు వేసి కాసేపు తిప్పి కందిపప్పు కూడా వెయ్యాలి .  1  కప్ కందిపప్పు  కి 2 కప్స్ వాటర్ వెయ్యాలి.కుక్కర్ మూత  పెట్టి 3 లేదా 4 విజిల్స్  వచ్చాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.   10 నిమిషాల తరవాత విజిల్ తీసి స్టవ్ ఆన్ చెయ్యాలి .గరిటతో కలుపుతూ 1/2 చెక్క ని మ్మరసం పిండి , కాసేపు తిప్పి కొంచెం దగ్గరికి అయ్యాక  తీసే  ముందు 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తే  చాల టెస్ట్ గ   ఉంటుంది.  పులుపు చాలక పొతే  ఇంకొక 1/2 చెక్క కూడా  రసం తీసి  వెయ్యవోచ్చు సాల్ట్ కూడా  చూసుకుంటూ ఉండాలి చాలకపోతే  కొంచెం వెయ్యాలి.




Sunday, April 21, 2019

Chicken Biriyani

వలసిన వస్తువులు     : 

చికెన్                         :  1/2 కేజీ ( శుభ్రంగా కడిగి ఉంచాలి)
ఆనియన్స్                :  2 ( కట్ చేసి ఉంచాలి)
పర్చిమిర్చి                :    2 లేదా 3( చీలికలుగు కట్ చెయ్యాలి)
టమాటో                    :  2 చిన్నవి( కట్ చేసి ఉంచాలి)
అల్లం                        : 2 అంగులాల ముక్క
వెల్లుల్లి                      :  1 పెద్దపాయాయి( అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఉంచుకోవాలి)
మసాలాదినుసులు  : లవంగాలు  4,యాలకులు 4, దాచినచెక్క చిన్నవి 2, జాపత్రి కొంచెం,
మరటిమొగ్గ   2, బిరియాని ఆకు 4
కొత్తిమీర                    :  2 కట్టలు (చిన్నవి  3  ఐనా వేసుకోవచ్చు )
పొదీన                        :  2 కట్టలు ( లేదా 3 వేసిన వేసుకోవొచ్చు)
బిరియాని రైస్           :  2 గ్లాస్ ( 1/2 కేజీ)( కడిగి 1/2 గంట అయినా ముందుగా నానబెట్టాలి)

సాల్ట్                           : 2 స్పూన్స్
కారం                           : 3 స్పూన్స్ ( మనము  చూసుకోని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు)
పసుపు                        : 1 స్పూన్
జీలకర్ర పొడి              : 2 స్పూన్స్
గరం మాసాల             : 3 స్పూన్స్
నెయ్యి                         : 4 స్పూన్స్
బట్టర్                          : కొంచెం 
పెరుగు                        : 5 స్పూన్స్

తయారుచేయువిధానము   :

ముందుగా     ఒక  బౌల్ లో  చికెన్, సాల్ట్  కా రం, పసుపు పెరుగు  , అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ వెయ్యాలి,కొంచెం కొత్తిమీర,  కొంచెం పొదీనా కూడావేసి కలిపి , 1/2 జీలకర్రపొడి,1/2 మసాలాపొడి కూడావేసి  ( 1/2 గంట అయినా ఉంచాలి). స్టవ్ మీద  బిరియానికి   గిన్నె పెట్టుకొని నెయ్యివెయ్యాలి . (ఈలోపు ప్రక్క న వాటర్ మరగా పెట్టుకుంటూ ఉండాలి. వాటర్ కాగాక రైస్ వేసి కొంచెం సాల్ట్ వేసి, సోంపుకూడా 1 స్పూన్ వెయ్యాలి  . కొంచెం పొదీనా కొత్తిమీర రైస్  ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది.   )మసాలా దినుసులు  వెయ్యాలి   వెంటనే ఆనియన్స్,పర్చిమిర్చి, సాల్ట్ వేసి, పసుపు కూడా వేసి కాసేపటికి టొమాటొకూడా వేసి కొంచెం మగ్గాక చికెన్  ని వెయ్యాలి. 5 నిమిషాలు కలిపి కొంచెం దగ్గరికి అవుతుంది అనగా కారం, జీలకర్రపొడి అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొత్తిమీర కొంచెం ,పొదీనా కొంచెం ,బిరియాని ఆకు వేసి  కొంచెం  వాటర్ గ ఉన్న పర్లేదు ప్రక్కన 70% ఉడికిన రైస్ ని వడకట్టి న గరిటతో  తీసి ఈ చికెన్ మీద వేస్తూ ఉండాలి చికెన్ కనపడకుండా పరవా లి . అట్ల  మొత్తం రైస్ ని వడకడుతూ వేసి మధ్య లో రైస్ మీద కొత్తిమీర, పొదీనా కూడా వేస్తూ ఉండాలి. అంత వేసాక రైస్ పైన బట్టర్ కొంచెం చిన్న పీసెస్ గ  అక్కడక్కడ  వేసి గ్లాస్ లిడ్ పెట్టి . పైన లీక్ లేకుండా చిన్న నాప్కిన్ జాగర్తగా మంటకి తగలకుండా లిడ్ మీద వెయ్యాలి. చిన్న మంట  మీద  8  నిమిషాలు ఉంచి ఒక సా రి చూసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.  తీసే  ట ప్పుడు  జాగర్త గ అడుగునుండి పైకి తిరగ వేసి వడ్డించుకోవాలి.  వీడియో లో లాగా .





Kobbari Annam

కావలసిన వస్తువులు    :

బిరియాని రైస్            :   1 గ్లాస్ ( 1/4 కేజీ)( కడిగి నానబెట్టి ఉంచాలి)
కొబ్బరి చెక్కలు          :   2( వాటిని కోరి కొంచెం వాటర్ వేసి వడ కట్టి 2 గ్లాస్ లు ఉండాలి)
పర్చిమిర్చి                  :  4 లేదా 5( చీలికలు చెయ్యాలి)
జీడిపప్పు                    :  కొంచెం
నెయ్యి                         :  3 స్పూన్స్
మసాలాదినుసులు    :  లవంగాలు  3, యాలకులు  3,  దా చినచెక్క : చిన్నది, మరటిమొగ్గ            చిన్నది                                 
బిరియాని ఆకు            :  2
సాల్ట్                              : 11/2 స్పూన్

తయారీవిధానము     :

ముందుగా  స్టవ్  వెలిగించి  కుక్కర్ పెట్టి  నెయ్యి వెయ్యాలి , కాగాక మసాలాదినుసులు  వేసి జీడిపప్పువేసి, బిరియానియాకు వేసి ,  పర్చిమిర్చి వెయ్యాలి.  బిరియాని రైస్   వేసి, తిప్పి  కొబ్బరి పాలు  వేసి ,సాల్ట్ కూడా వేసి కక్కేర్ మూతపెట్టి 1 విజిల్ రాగానే కట్టివేయాలి. దీ నిలోకి పెరుగుచట్ని ( దానినే కొందరు కచా మ్ బరం  అని కూడా అంటారు) వేడిగా తింటే  చాల రుచిగా ఉంటుంది.



Thursday, April 18, 2019

Egg Pudding


 కావలసిన వస్తువులు    :
  
పాలు                        :   1/2 లీట్ ర్
ఎగ్స్                         :   4 ( ఓన్లీ యెల్లౌస్ మాత్రమే)
కస్టర్డ్   పొడి              :   3 స్పూన్స్ ( కొంచెం పాలు వేసి కలిపి ఉంచాలి)
మిల్క్ పొడి              :  4 స్పూన్స్ ( కొంచెం పాలు వేసి కలిపి ఉంచాలి)
మిల్క్ మెయిడ్       : 1/2 (  అమూల్ మిల్క్ మెయిడ్ 1 డబ్బాలో 1/2 తీసుకుంటాయి సరి పోతుంది . కొంచెం టేస్ట్  గురుంచి  లేక పోయిన పర్వాలేదు)
వె నిల్లా ఎసెన్స్       :   1 స్పూన్
షుగర్                       :  100గ్ర






తయారు చేయు విధానము     :

ముందుగా ఒక బౌల్ లో షుగర్,  ఎగ్స్ యెల్లౌస్    వేసి  (ఎగ్ బీ టర్   లేద  కేక్ బీ టర్   తో)   బీట్ చెయ్యాలి . దానిలో  పాలు,  మిల్క్ పొడి,  కస్టర్డ్   పొడి  , వె నిల్లా ఎసెన్స్ ఒక దాని తర్వాత ఒకటి  వేసి బీట్ చెయ్యాలి  లేదా గుంటగరిటతో కూడా కలప వొచ్చు.  మిల్క్ మెయిడ్ కూడా వేసి కలిపి
ఉంచాలి.  స్టవ్ మీద  చిన్న మూకుడు కానీ బౌల్ కానీ పెట్టి దానిలో 4 స్పూన్స్ షుగర్ వేసి (వాటర్ వెయ్యకూడదు  )  స్పూన్స్ తో తిప్పుతూ ఉండాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ,మరి  1 నిమిషం ఉంచి దానిని( లోతుగాఉన్న గిన్నెలో) గిన్నెలో వేసి గిన్నెని షుగర్ సిరప్ ( దానినే కారమిల్  అని అంటారు) స్ప్రెడ్  అయ్యాటట్టు   చేసి తరవాత  దానిలో కలిపి ఉంచిన మిల్క్ ని పోసి  కుక్కర్ లో 20 మినిట్స్  ఉంచాలి( విజిల్  పెట్ట కూడదు). కొంచెం ఆరాక మూత  తీసి చాకుతో లోపల చుట్టూ ఒక సారి రౌండ్  గ  తిప్పి(  పుడ్డింగ్ కి గిన్నెకి మధ్యలో) పైన దానికి సరిపడా ప్లేట్ కానీ  వేరే బౌల్ కానీ పెట్టి  అప్ అండ్ డౌన్ చెయ్యాలి . పుడ్డింగ్ క్రింద ప్లేట్ లోకి  పడుతుంది.  ( వేడిగా ఉన్నప్పుడు త్రిప్పవోద్దు ). దాని మీద మనం బాదం  కానీ జీడిపప్పు కానీ
చిన్నగా కట్ చేసుకుంటే  చూడటానికి, తినడానికి   బాగుంటుంది.






Gongura Roti pachhadi

కావలసిన వస్తువులు  :  

గోంగూర                     :  5 లేదా 6 కట్టలు ( ఆకు తీసి శుభ్రంగా కడిగి వడకట్టి బట్ట మీద  వేసి  బాగా                                                    ఆరనివ్వాలి)
పర్చిమిర్చి                 :  7 లేదా 8
వెల్లుల్లి                       :  6 లేదా 7 రెబ్బలు
జీలకర్ర                      :  1స్పూన్
సాల్ట్                           : 1 1/2 స్పూన్
ఆయిల్                      :  4 స్పూన్స్
పసుపు                       :  1/2 స్పూన్
ఇంగువ                     :  కొంచెం
ఆనియన్                  :  1( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తాలింపు                   :  ఆవాలు 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్, జీలకర్ర 1/4స్పూన్
కరివేపాకు                 :  1 రెబ్బ
ఎండుమిరపకాయ   : 1



తయారుచేయువిధానము     :

ముందుగా స్టవ్ వెలిగించి  మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసి , పర్చిమిర్చి వేయించాలి,వేగాక దానిలో వెల్లుల్లి ,జీలకర్ర వేసి ప్రక్కన పెట్టి , అదే  మూకుడులో ఇంకొంచెం ఆయిల్ వేసి గోంగూరని  వేయించాలి .గోంగూర వేగాక స్టవ్ ఆఫ్ చేసి ముందు గా   పైన  వేగిన పర్చిమిర్చిని కొంచెం సాల్ట్ వేసి  మిక్సీ చేసి  ఒక వేల  కా రం  ఎక్కువ అవుతుంది అని అనుకుంటే  మిక్సీ చేసిన కా రం కొంచెం ప్రక్కన కూడా పెట్టుకోవోచ్చు . అదే మిక్సీలో  గోంగూరకూడా వేసి మల్లి మిక్సీ  పడతాము.   అప్పుడు కారం ,సాల్ట్ చూసి  ఏది  తగ్గిందో  అది  కలుపుకోవచ్చు. చిన్న మూకుడు  పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి తాలింపు,ఇంగువ ,పసుపు  , కరివేపాకు,ఎండుమిర్చి  వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్ ముక్కలు వేసి, మిక్సీలో ఉన్న గోంగూరని వేసి కలిబెట్టి  బౌల్ లోకి తీసుకోవాలి. 










  టిప్
 (గోంగూర మార్కెట్ నుండి తేగానే ఆకులుతీసి కడిగి వడకట్టి   బట్ట  మీద ఆరబెట్టి బాగా ఆరాక   కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి వేయించి బాక్స్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టి  ఎప్పుడు కావాలంటే   అప్పుడు మిగిలిన పద్దతి లో పచ్చడి చేసుకోవొచ్చు  )






Cup Cakes

కావలసిన వస్తువులు    :

మైదా                  :   150 గ్ర  ( మైదా ని జల్లించి దానిలో బేకింగ్ పౌడర్ , సోడా కూడా వేసి ఉంచుకోవాలి)
ఎగ్స్                    :   3
బట్టర్                  :   120 గ్ర
షుగర్                  :   100 గ్ర
వెనిల్లా ఎసెన్స్   :   1 1/2 స్పూన్
బేకింగ్ పొడర్     :    1/2 స్పూన్
బేకింగ్ సోడ        : 1/4 స్పూన్
ట్యూటీ ఫ్రూటి     : కొంచెం



తయారువిధానము     :


ముందుగా బౌల్ లో బట్టర్ ,షుగర్  వేసి కేక్ బీటర్ తో   బీట్ చెయ్యాలి . షుగర్ కరిగింది అని అనిపిస్తే  ,   వెనిల్లా ఎసెన్స్  కూడా వేసి కాసేపు బీట్ చేసి , దానిలో ఒక ఎగ్ కొట్టి వేసి మల్లి బీట్ చెయ్యాలి ,తరువాత మరియొక ఎగ్ వేసి బీట్ చెయ్యాలి,తరువాత 3 వ ఎగ్ కూడా వేసి బీట్ చేసినప్పుడు కొంచెం   లూస్ గ ఉంటుంది.  అప్పుడు మైదా ని 3  సార్లుగా  కొంచెం కొంచెం వేస్తూ    గరిటతో స్మూత్ గ కలపాలి .  కేక్ బౌల్ లో కేక్  పేపర్ పెట్టి ఈ మిక్సీఈ ని కొంచెం వెళితీగ  వెయ్యాలి , దానిపై  ట్యూటీ  ఫ్రూటీ ని కొంచెం వెయ్యాలి.  ఒవేన్ ని ఫ్రీహిట్  చేసి  160  డిగ్రీ   లో పెట్టి 20 మినిట్స్  బే కె చెయ్యాలి . మధ్యలో చూసుకోవాలి బాగా పొంగినట్టు వస్తాయి.    చూసుకొని ముందుగా బాగా పొంగీతే  ఒవేన్ ఆఫ్ చెయ్యాలి.  లేదా కరెక్ట్ టైంకి  ఆగిపోతుంది 




Mutton Dosakaya Curry

కావలసిన వస్తువులు      :

మటన్                   : 1/2 కేజీ ( శుభ్రంగా కడిగి బౌల్ లోకి తీసుకోవాలి)
ఆనియన్స్            :  2 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
దోసకాయ              :  1 చిన్న సైజు ( పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టొమాటోస్            :   2 చిన్నవి ( కట్  చేసి ఉంచుకోవాలి)
అల్లం                    :   చిన్న పీస్
వెల్లుల్లి                  :  6 లేదా 7 రెబ్బలు( అల్ల మ్ , వెల్లుల్లి పేస్ట్ చేసి ఉంచాలి)
ఆయిల్                 :  4  స్పూన్స్
కారం                      : 2 స్పూన్స్
పసుపు                   :  1 స్పూన్
జీలకర్రపొడి          :  1 స్పూన్
గరంమసాలా         :  2 స్పూన్స్
కొత్తిమీర                 :  1 గుప్పెడు


తయారుచేయు విధానము   
ముందుగా స్టవ్ వెలిగించి  కుక్కర్  పెట్టాలి.  ఆయిల్ వేసి కాగాక  ఆనియన్స్ వెయ్యాలి,
సాల్ట్, పసుపు కూడా వేసి, కాసేపు  తిప్పాక అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి ,  మటన్  కూడా వేసి , టొమాటోస్ కూడావేసి ,కారం కూడా వేసి  కాసేపు  కూరని తిప్పి కుక్కర్ మూతపెట్టి  4 లేదా 5 విజిల్స్  వచ్చాక స్టవ్ ఆఫ్  చెయ్యాలి.  5 నిమిషాలతరువాత  కుక్కర్  మూత తీసి స్టవ్ వెలిగించి  దోసకాయముక్కలు వేసి ,జీలకర్రపొడి కూడా వేసి, కాసేపు తిప్పి, దోసకాయ మగ్గింది అనగా  గరం మసాలా కూడా వేసి, సాల్ట్ సరిపోయిందా లేదా చూసి  సరిపోకపోతే  కొంచెం వేసి,    కొంచెం ఆయిల్ తేలింది  అనగా  కొత్తిమీర చల్లి  కూర  ఒకసారి  తిప్పి , బౌల్ లోకి తీసుకోవాలి. 




Wednesday, April 17, 2019

Anapakaya roti pachhadi

కావలసిన వస్తువులు      :

ఆనపకాయ            :  చిన్న ముక్క ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి             :   6 లేదా 7 ( కరం ఎక్కువ కావాలం టే  ఇంకొక 3 తీసుకోవచ్చు)
చింతపండు          :   కొంచెం మాత్రమే
వెల్లుల్లి                    :   5 లేదా 6 రెబ్బలు
జీలకర్ర                  :   1 స్పూన్                                       
సాల్ట్                       :    1 స్పూన్
పసుపు                    :   1/4 స్పూన్
కొత్తిమీర                  : కొద్దిగా
కొబ్బరి                     :  చిన్న ముక్క

తయారు చేయు విధానము     :

ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి , మూకుడులో ఆనపకాయ ముక్కలు,పర్చిమిర్చి  ఆయిల్ వేసి, ముక్కలు మగ్గే  వరకు సన్నటి సెగ మీద మూత పెట్టి తిప్పుతూ ఉండాలి.   వేగాక జీలకర్ర, కొబ్బరి, పసుపు, వెల్లుల్లి ,చింతపండు వేసి కాసేపు తిప్పి , స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర సాల్ట్ వేసి తిప్పి  చల్లారాక  మిక్సీ  పట్టాలి.  ఈ రోటి పచ్చడి చాలా   టెస్ట్ గ  ఉంటుంది.



Tuesday, April 16, 2019

Vankaya Masala Curry

కావలసిన వస్తువులు :

వంకాయలు           : 1/4 కేజీ ( 2 చీలికలుగా చివర విడిపోకుండా కట్ చేసి వాటర్ లో ఉంచాలి కొంచెం  సాల్ట్ కూడావెయ్యాలి)
ఆనియన్స్             :   2( కట్ చేసి  మిక్సీ లో కచ్చా బిచ్చగా మిక్సీ చెయ్యాలి)
టొమాటోస్              :  2( కట్ చేసి మిక్సీయే చెయ్యాలి)
అల్లం                      :  చిన్న ముక్క
వెల్లుల్లి                    :  4 లేదా 5 రెబ్బలు ( అల్లం ,వెల్లుల్లి మిక్సీ  పట్టి ఉంచాలి)
కరివేపాకు               :  2 రెబ్బలు
పర్చిమిర్చి              :  2
కొత్తిమీర                  :  కొంచెం
కా రం                      :  1 స్పూన్
పసుపు                     :  1 స్పూన్
గరం మసాలా         :  1 స్పూన్
సాల్ట్                         : 1 స్పూన్
ఆయిల్                   :  4 స్పూన్స్
తాలింపు                 :  ఆవాలు 1 స్పూన్. జీలకర్ర 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్


తయారువిధానము     :

ముందుగా స్టవ్ వెలిగించి  మూకుడుపెట్టి   ఆయిల్  వేసి  వంకాయలు వేసి, ( మూతపెట్టి వేయించాలి).  కొంచెం మగ్గినట్టుగా వేయించాలి.వాటిని వేరే బౌల్ లో తీసుకోవాలి. అదే  మూకుడులో ఇంకొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసి,కరివేపాకు వేసి,  పర్చిమిర్చి వేసి  ఆనియన్ పేస్ట్ కూడా వేసి,సాల్ట్ పసుపు, వెయ్యాలి. 2 నిమిషాలు తరువాత టమాటో పేస్ట్ కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కా రం, మసాలాకూడా వేసి  కొంచెం సేపు  పచ్చి వాసన  పోయే దాక తిప్పి మగ్గిన వంకాయలు కూడా వేసి , సన్నటి   మంటమీద  మూత పెట్టి ఉంచాలి.  ఆయిల్ కొంచెం తేలినప్పుడు  కూర బౌల్ లోకి తీసుకోవాలి.





Aanapakaya Milk curry

కావలసిన వస్తువులు   :

ఆనపకాయ              :  చిన్న ముక్క ( పీల్ చేసి కట్ చేసుకొని ఉంచాలి)
ఆనియన్స్               :  2( కట్ చేసుకొని ఉంచాలి)
టమాటో                   :  1 ( కట్ చేసుకొని ఉంచాలి)
పర్చిమిర్చి               :  2 లేదా 3( కారాన్ని బట్టి( కట్ చేసుకోవాలి)
పసుపు                     :  1/2 స్పూన్
సాల్ట్                         :  1 1/2 స్పూన్           
ఆయిల్                    :  2 స్పూన్స్
పాలు                        :  1 కప్
తాలింపు                  : ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్,మినపప్పు 1 స్పూన్,
వెల్లుల్లి                     : 4 రెబ్బలు
కరివేపాకు                : 2 రెబ్బలు

తయారువిధానము   :

ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి  ఆయిల్ వేసి తాలింపు వేసి, వెల్లుల్లివేసి, కరివేపాకు కూడా వేసి, తరువాత ఆనియన్స్ వెయ్యాలి.పర్చిమిర్చి కూడావేసి,  సాల్ట్ పసుపు వేసి కాసేపటి తరువాత ఆనపకాయ ముక్కలు కూడా వేసి, టమాటో కూడా వెయ్యాలి.  కొంచెం కూర తిప్పి , మూత  పెట్టి సన్నటి సెగ మీద ఉంచాలి.  మధ్యలో కూర తిప్పుతూ ఆనపకాయ ఉడికాక  కూర దగ్గరికి అవుతుంది అనగా పాలు  పోసి గరిటతో తిప్పాలి. కొంచెం దగ్గరికి అవుతుందన గ  సాల్ట్ చూసి చాలక పోతే కొంచెం వేసి  కూర బౌల్ లోకి  తీసుకోవాలి.


                                                               
   ,

Panasapottu Curry

కావలసిన వస్తువులు   :

పనసపొట్టు            : 1/4 కేజీ ( బౌల్ లో కొంచెం వాటర్ వేసి  కొంచెం పసుపు,సాల్ట్ వేసి 5 మినిట్స్ ఉడికించి  వడకట్టి ఉంచాలి)
వేరుశెనగపప్పు      : 1/2 కప్
పసుపు                    : 1/2 స్పూన్
పర్చిమిర్చి              :2 లేదా 3
చింతపండు           : చిన్న నిమ్మ కయ సైజు( కొంచెం వాటర్ వేసి చిక్కగా రసం తీసుకోవాలి)
 కరివేపాకు              : 2 రెబ్బలు
ఆవపిండి                :  2 స్పూన్స్
సాల్ట్                         : 1 1/2 స్పూన్
ఆయిల్                    : 4 స్పూన్స్
ఇంగువ                    : కొంచెం
వెల్లుల్లి                     : 4 లేదా  5 రెబ్బలు
తాలింపు                  : ఆవాలు, 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, సెనగపప్పు 2 స్పూన్స్,
మినపప్పు 1 స్పూన్                                                       

తయారువిధానము    :

ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాలి .కాగాక ఆయిల్ వేసి కాగాక వేరుశెనగపప్పు వేసి ఒక నిమిషము తరువాత తాలింపు వేసి , ఇంగువ కూడావేసి,కరివేపాకు కూడా వేసి , వెల్లుల్లి పర్చిమిర్చీకూడావెయ్యాలి.  ఉడికిన పనస పొట్టు వేసి, కూర కలపాలి.  కాసేపటి తరవాత చింతపండు పులుసు ,ఆవపిండి కూడా వేసి తిప్పి సాల్ట్ చూసుకొని వీలుని  బట్టి  చాలక పోతే  కొంచెం సాల్ట్ ,పులుపు   కూడా  వేసుకోవాలి.  కూర బౌల్ లోకి   అతీసుకోవాలి.


Beerakaya Senagapappu, Kobbari curry

కావలసిన వస్తువులు     :


బీరకాయలు          :  1/2 కేజీ ( పీల్ చేసి కావలసిన సైజు లో ముక్కలు కట్ చేసుకోవాలి)
సెనగపప్పు            :  50 గ్రా
కొబ్బరి                    :  1/2 చెక్క( కోరుకొని ఉంచాలి)
పర్చిమిర్చి             :  2(కట్ చేసుకొని ఉంచాలి)
ఆనియన్               :  1( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కా రం                      : 1 స్పూన్
పసుపు                     : 1/2 స్పూన్
అల్లం                      : చిన్న ముక్క
వెల్లుల్లి                    : 6 లేదా 7 రెబ్బలు ( అల్లం ,వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి)
గరం మసాలా         : 1 స్పూన్
సాల్ట్                        : 1 1/2 స్పూన్
కరివేపాకు               : 2 రెబ్బలు
ఆయిల్                   : 4 స్పూన్స్
తాలింపు                 :  ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినపప్పు  1 స్పూన్

తయారువిధానము    :                   


ముందుగా   మూకుడులో సెనగపప్పుని  కడిగి వన్ గ్లాస్ వాటర్  వేసి   స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. ఒక ఉడుకు రాగానే ఆనియన్స్,పర్చిమిర్చి వెయ్యాలి బీరకాయముక్కలు కూడా  వెయ్యాలి. అవి ఉడుకుతుండగా  అల్లం వెల్లుల్లి పేస్ట్  వెయ్యాలి. సెనగపప్పు ఉడికిందో లేదో చూసి లేదంటే  ఇంకా కొంచెం వాటర్ వెయ్యవోచ్చు .సెనగపప్పు ఉడికాక  వరసగా సాల్ట్,కారం,పసుపు, కొబ్బరి,మాసాల  కూడా వేసి  కూర వాటర్ లేకుండా  చూసుకోవాలి. ప్రక్కన వేరే మూకుడులో కొంచెం ఆయిల్ వేసి కాగాక తాలింపు వేసి 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసి, పైన తాలింపుని  కూరలో వేసి , 1/2 చెక్క నిమ్మకాయ  రసం  పిండి కూర తిప్పి బౌల్ లోకి తీసుకోవాలి. 



Sunday, April 14, 2019

vankayatomato curry

Vankaya Tomato curryకావలసిన వస్తువులు:

వంకాయలు               :  1/2 కేజి
టొమాటోస్                  :  100 గ్రా
ఆనియన్స్                 :  2 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి                 :  5
అల్లం                         :  చిన్న ముక్క
వెల్లుల్లి                       :   5 లేదా 6 రెబ్బలు
జీలకర్ర                      :  1 స్పూన్
                                       ( ముందుగా పర్చిమిర్చి,అల్లం, వెల్లుల్లి,జీలకర్ర,
                                          అన్ని కలిపి గ్రైండ్ చేసుకొని ఉంచాలి)
సాల్ట్                          :  1 స్పూన్
పసుపు                       :  1 స్పూన్
కరివేపాకు                  :  2 రెబ్బలు
కొత్తిమీర                     :  ఒక గుప్పెడు
ఆయిల్                      :  3 స్పూన్స్


తయారువిధానము      :

ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాలి.   ఆయిల్ వేసి కాగాక   తాలింపు వేసి , కరివేపాకు వెయ్యాలి . తరువాత  ఆనియన్స్ వెయ్యాలి ,పసుపు సాల్ట్ వెయ్యాలి. కాసేపటికి టొమోటోస్ వెయ్యాలి.  తరువాత అల్లం ,పర్చిమిర్చి పేస్ట్  వెయ్యాలి. చిన్న మంట  పెట్టి, మూత పెట్టి సన్నటి సెగ  పెట్టాలి. కూర దగ్గరికి అయ్యాక కొత్తిమీర చల్లి బౌల్ లోకి తీసుకోవాలి. 





Thursday, April 11, 2019

Thotakoora Tomato curry

కావలసినవస్తువులు     :


తోటకూర               :  5 కట్టలు (చిన్నగా కట్ చేసుకోవాలి)
టొమాటో                :  5(చిన్నగా కట్ చేసుకోవాలి)
ఆనియన్               :  1(చిన్న గ కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి            :  2 (కట్చేసుకోవాలి)
నిమ్మకాయ           :  1                                             
           
సాల్ట్                       :  1 1/2 స్పూన్ల
కా రం                     :  1 స్పూన్
పసుపు                   :  1 స్పూన్
ఇంగువ                 :  1/2 స్పూన్
కరివేపాకు             :  1 రెబ్బ
తాలింపు                :  ఆవాలు 1 స్పూన్,
                                   జీలకర్ర 1 స్పూన్,మినపపప్పు 1 స్పూన్,
                                    పచ్చిసెనగపప్పు 1 స్పూన్,వెల్లుల్లి 5 రెబ్బలు

  తయారువిధానము     :

ముందుగా కూకర్లో తోటకూర, టమాటో,ఆనియన్స్,పర్చిమిర్చి, కొంచెం వాటర్ వేసి పొయ్యిమీద పెట్టి  5,6 విజిల్స్ రానివ్వాలి.   ఆరాక   విజిల్ తీసి  కా రం, సాల్ట్,పసుపు వేసి తోటకూర మెత్త గ అయ్యేదాకా గరిటతో తిప్పుతూ పొయ్యి మీద ఉంచాలి. లేదా పప్పుగుత్తి తో మెదపాలి. 
 దగ్గరికి అయ్యాక నిమ్మకాయ రసం పిండి ( ఒక్కొక్క సా రి హాఫ్ చెక్క సరిపోతుంది పులుపుకు) ప్రక్కన పెట్టి  వేరే బౌల్ లో తాలింపు పెట్టుకొని (కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి కరివేపాకు,ఇంగువ కూడావేసి,పైన కూరలో కలపాలి)కూరలో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే  చాల కమ్మగా టేస్టు గ  ఉంటుంది.





Gummadikaya pulusu

కావలసిన వస్తువులు    :

గుమ్మడికాయ                 :  1 చిన్న ముక్క (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఆనియన్స్                      :  2 ( పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి                      :  2 (కట్ చేసుకోవాలి)
టొమాటోస్                       : 3  (కట్ చేసుకోవాలి)
కరివేపాకు                        :  2 రెబ్బలు
సాల్ట్                                 :  సరిపడ
కారం                                :  2 స్పూన్స్
పసుపు                              : 1 స్పూన్
ఆయిల్                             : 3 స్పూన్స్
కొత్తిమీర                            :  గుప్పెడు
పోపుదినుసులు                : ఆవాలు 1 స్పూన్ ,జీలకర్ర 1స్పూన్,సెనగపప్పు 1స్పూన్,వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 2,
ఇంగువ                              :  కొంచెం
బెల్లం                                  :  చిన్న ముక్క
చింతపండు                       :  కొంచెం రసం తీసి ఉంచాలి

                                                                                             

 తయారువిధానము      :

ముందుగా  స్టవ్  వెలిగించి  మూకుడు పెట్టి, కాగాక ఆయిల్ వెయ్యాలి. తరువాత పోపుదినుసులు వెయ్యాలి ,ఇంగువ వేసి కరివేపాకువేసి, ఆనియన్స్ వెయ్యాలి . పసుపు,సాల్ట్,వేసి కాసేపుతరవాత పర్చిమిర్చి, టొమాటోస్ వెయ్యాలి. గుమ్మడిముక్కలుకూడావేసి, తిప్పా క కారమువేసి కాసేపు సన్నటి సెగమీద మంట పెట్టాలి. కొంచెం ఉడికాక బెల్లం వేసి, ఇంకొంచెం ఉడికాక   చింతపండు పులుసు వెయ్యాలి.  కూర దగ్గరికి అయ్యాక సాల్ట్ చూసుకొని చాలకపోతే కొంచెం సాల్ట్ వేసి, కొత్తిమీర చల్లి కూర బౌల్ లోకి తీసుకోవాలి. 


Sunday, April 7, 2019

Bendakaya Vepudu

కావలసిన వస్తువులు     :
                                                                               


బెండకాయలు           :  1/2 కేజీ  ( కడిగి ఆరబెట్టి తడిలేకుండా కట్ చేసుకోవాలి)
ఆనియన్                   :   1( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు                  :   2 రెబ్బలు
కారానికి                      :   (4 ఎండుమిరపకాయలు,6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర) వీటిని                                                    మిక్సీ చేసి  ఉంచాలి)
తాలింపుకు                :  ఆవాలు 1 స్పూన్ ,వేపిన సెనగపప్పు  1 స్పూన్ ,మినపప్పు 1 స్పూన్                                                        వెల్లుల్లి చిదిమినవి 2, ఎండుమిరపకాయ 1,
పసుపు                        :  1 స్పూన్
సాల్ట్                            :  1 స్పూన్                                                   
ఆయిల్                       : 3 స్పూన్స్

  తయారు చేయు విధానము   :
                                             

ముందుగా స్టవ్ వెలిగించి  మూకుడు పెట్టి  కాగాక   ఆయిల్ వెయ్యాలి. కాగాక  తాలింపు వెయ్యాలి. వేగాక ఆనియన్స్ వెయ్యాలి,కాసేపు తిప్పా క . బెండకాయలు వెయ్యాలి.  పసుపు వెయ్యాలి మూతపెట్టకుండా సన్నటి సెగ మీద ఉంచి  తిప్పుతూ ఉండాలి. దగ్గరికి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు పొట్టు  తీసినవి  10 లేదా 12  వేసు కుంటే  కూర చాల కమ్మగా కూడ ఉంటుంది. కాసేపు తిప్పి , దగ్గరికి అయ్యాక  పైన ఉన్న కారాన్ని , సాల్ట్ ని వేసి  సాల్ట్ ,కా రం చూసుకొని మల్లి వేసి కూర తిప్పి బౌల్ లోకి తియ్యాలి.


                                                           


               
     






Soya Chunks Biriyani

కావలసిన వస్తువులు        :

సొయా చంక్స్                 :  1 కప్
బాసుమతి రైస్                :  1 కప్
అల్లం వెల్లులి పేస్ట్        :  2 స్పూన్స్ ( చిన్న అల్లం ముక్క,అండ్ వెల్లుల్లి రెబ్బలు 8)
గరంమసాల                    :  2 స్పూన్స్
కారం                                 : 3 స్పూన్స్
ఆనియన్                          :  1 పెద్దది ( సన్నగా నిలువుగా కట్ చేసుకోను ఉంచాలి)
టమాటో                            :  1 పెద్దది లేదా చిన్నవి 2 ( సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి                        : 4( చీలికులుగా కట్ చేసుకోవాలి)
పసుపు                               : 1 స్పూన్
తాలింపుకు                       : యాలకులు 4, దాచినచెక్క చిన్నది  ,లవంగాలు 6,బిరియా ని ఆకూ 3
పొదీనా                               : గుప్పెడు ( కొంచెం ఎక్కువ అయిన పర్వాలేదు)
కొత్తిమీర                              : గుప్పెడు  ( కొంచెం ఎక్కువ అయిన పర్వాలేదు)
ఆయిల్ కానీ నెయ్యి         :  5 స్పూన్స్
బట్టర్                                 : 1 క్యూబ్                 







తయారుచేయు విధానము        :

అరగంటముందు  బాసుమతి రైస్ ని వాటర్ లో నానబెట్టాలి. సొయా చంక్స్   ని మరుగుతున్న  వాటర్ లో ఉడకబెట్టి,వార్చుకొని ఉంచుకోవాలి.


ముందుగా స్టవ్ ని వెలిగించి గిన్నె  పెట్టి   దానిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ మన వీలుని బట్టి వేసుకోవాలి. మరిగాక తాలింపు దినుసులు వేసి,  దానిలో ఆనియన్స్,పర్చిమిర్చి వేసి, తిప్పాక సాల్ట్ పసుపు కూడా వేసి తిప్పి ,  అల్లం వెల్లుల్లి  పేస్ట్ కూడా వెయ్యాలి. టమాటో ముక్కలు కూడా వేసి కా రం ,గరంమసాలా కూడా వేసి   తిప్పి సొయా చంక్స్  కూడా వేసి తి ప్పాలి 
 ఈలోపు మనం మరుగుతున్న  వాటర్ లో  బాసుమతి రైస్ వేసి ఉడికించుకోవాలి .  ఉడికేట ప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి .రైస్ కి సాల్ట్ సరిపోయింద లేదా కూడా చూసుకోవాలి.  దానిలో కొంచెం సోంపు,పొదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు 75 పర్సెన్ట్  బాయిల్  అయిన  రైస్ ని  వడకట్టి  పైన కర్రీ మీద పలచగా వెయ్యాలి.
 దాని మీద ఇంకొక లేయర్ గ పూర్తిగా బాయిల్ అయినా రైస్ ని వేసి  పైన కొంచెం బట్టర్ ని చిన్న చిన్న ముక్కలుగా వేసి,టైట్ మూత పెట్టిపెట్టాలి. వీలుని బట్టి 1/2 చెక్క నిమ్మకాయ కూడా రసం పిండు కోవచ్చు. వేడి వేడి గ తింటె చాల మంచిది. ఆరోగ్యానికి కూడా సొయా మంచిది.



                                                                 


                              





Beerakaya palu

కావలసిన వస్తువులు    :

బీరకాయలు                 : 2 (పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
 ఆనియన్స్                  : 2 పెద్దవి ( చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి                   :  3 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
 పాలు                           :  1 పెద్ద కప్
తాలింపు                      :  ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, సెనగపప్పు 1 స్పూన్,
                                         బద్ద మినపపప్పు 1 స్పూన్, ఎండుమిరపకాయ 1,వెల్లుల్లి రెబ్బలు4    ఆయిల్                        :  3 స్పూన్స్
పసుపు                          : 1 స్పూన్
కరివేపాకు                    : 2 రెబ్బలు     
                                                                                                     
తయారువిధానము    :

ముందుగా స్టవ్ వెలిగించి  మూకుడు పెట్టి  కాగాక ఆయిల్  వేసి మరిగాక , తాలింపు వెయ్యాలి.
కరివేపాకు వెయ్యాలి.  ఆనియన్స్ వేసి,పసుపు , సాల్ట్ కూడా వేసి, బీరకాయముక్కలు వెయ్యాలి.
తిప్పాక  సన్నటి సెగ మీద పెట్టి, మూత పెట్టాలి.  కూర దగ్గరికి అయ్యాక మీగడతో ఉన్న పాలు ఉన్నా వెయ్యవచ్చు. తిప్పి కూర తీసి బౌల్ లో వేసు కోవాలి.   పాలు కలిపిన కూరలు సమ్మర్ లో చాల బాగుంటాయి, హెల్త్ కి కూడా  మంచిది.

  







Semiya Upma

SEMIYA UPMA


కావలసిన వస్తువులు  :

సేమియా               : 1 కప్ (కొంచెం వాటర్ లో సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉడికించి  జల్లెడలో  వేయాలి)
ఆనియన్               :  1(కట్ చేసిఉంచాలి)
పర్చిమిర్చి             : 4 కానీ 5 (కట్ చేసి ఉంచాలి)
క్యారట్                    : 1 స్మాల్ (కోరుకొని ఉంచాలి)                       
వేరుశెనగపప్పు      : కొంచెం ,జీడిపప్పు కూడా వేసుకోవచ్చు
టమాటో                  : 1 (కట్ చేసి ఉంచాలి)
నిమ్మకాయ             : 1(స్మాల్ సైజు)
తాలింపుకు             : 1స్పూన్ ఆవాలు,1స్పూన్ సెనగపప్పు, కరివేపాకు 2 రెబ్బలు
ఆయిల్                   : 3 స్పూన్స్
కొత్తిమీర                  : కొంచెం

తయారుచేయువిధానము   :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాలి. దానిలో  ఆయిల్   వేసి మరిగాక  ఆవాలు,సెనగపప్పు,కరివేపాకు వెయ్యాలి. తరువాత వేరుశెనగపప్పు,
ఆనియన్ ముక్కలు,పర్చిమిర్చి ముక్కలు, వెయ్యాలి. కొంచెం వేగాక టమాటో ముక్కలు వేసి ,వన్ మినిట్ తరువాత  క్యారట్   కూడా వెయ్యాలి . సాల్ట్ కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి . ఎంధుకంటే  సేమియాలో ఉడికేట ప్పుడు  కొంచెం వాటర్ లో వేస్తాము కాబట్టి చూసుకొని వెయ్యాలి. కొంచెంవేగాక  సేమియాని వేసేయాలి.     
కొంచెం తిప్పాక   నిమ్మకాయ రసం పిండి
కొంచెం కొత్తిమీర వేసి తిప్పి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. తీసే  ముందు  ఒక స్పూన్ గరంమసాలా వేసుకున్న  బాగుంటుంది .  బౌల్ లోకి తీసుకోవాలి. 

                                                         









Dosakaya Pappu


Dosakaya Pappu

కావలసిన వస్తువులు  


 దోసకాయ            :చిన్నది 1
పర్చిమిర్చి            :2
టొమాటోలు           :3 ( చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి)
కా రం                      :1 స్పూన్ 
సాల్ట్                         : తగినంత 
నిమ్మకాయ              1/2 చెక్క 
కందిపప్పు              : 1స్మాల్ కప్
వాటర్                       :2కప్స్
ఉల్లిపాయ               : 1 (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి) 
పసుపు                      : 1 స్పూన్ 

పోపుకికావలసినవి   : 1 స్పూన్ ఆవాలు 
                                     : 1 స్పూన్  జీలకర్ర 
                                     :5 వెల్లుల్లి రెబ్బలు
                                      :ఇంగువ కొంచెం 
                                       :కరివేపాకు 2 రెబ్బలు  


తయారువిధానం:
 ముందుగా కుక్కర్లో  కందిపప్పు ,వాటర్ ,టొమాటోముక్కలు,ఉల్లిపాయముక్కలు ,పర్చిమిర్చి ముక్కలు,దోసకాయముక్కలు,సాల్ట్ ,కారమ్ ,పసుపు  వేసి కుక్కర్ 3 విజిల్స్  వచ్చాక ఆఫ్ చెయ్యాలి. 



 వేడి తగ్గాక  కుక్కర్ మూతతీసి స్టవ్ వెలిగించి గరిటతో పప్పుతిప్పుతూ ఉండాలి. ప్రక్కన తాలింపుకు చిన్న మూకుడు పెట్టి దానిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కొంచెం వేడిఅయ్యాక దానిలో ఆవాలు,జీలకర్ర,ఇంగువ , కరివేపాకు వేసి దీనిని పైన పప్పులో వేసి గరిటతో తిప్పాలి . దానిలో నిమ్మకాయ రసం పిండాలి. నిమ్మకాయ పడనివారు కొంచెం చింతపండు గుజ్జు కలుపుకోవచ్చు.దానిని తీసి వక  బౌల్లో వేసుకోవాలి.  చాల కమ్మగా ఉంటుంది. 














   

2 comments:

  1. This comment has been removed by the author.
    ReplyDelete