కావలసిన వస్తువులు
దోసకాయ :చిన్నది 1
పర్చిమిర్చి :2
టొమాటోలు :3 ( చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి)
కా రం :1 స్పూన్
సాల్ట్ : తగినంత
నిమ్మకాయ 1/2 చెక్క
కందిపప్పు : 1స్మాల్ కప్
వాటర్ :2కప్స్
ఉల్లిపాయ : 1 (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు : 1 స్పూన్
పోపుకికావలసినవి : 1 స్పూన్ ఆవాలు
: 1 స్పూన్ జీలకర్ర
:5 వెల్లుల్లి రెబ్బలు
:ఇంగువ కొంచెం
:కరివేపాకు 2 రెబ్బలు
తయారువిధానం:
ముందుగా కుక్కర్లో కందిపప్పు ,వాటర్ ,టొమాటోముక్కలు,ఉల్లిపాయముక్కలు ,పర్చిమిర్చి ముక్కలు,దోసకాయముక్కలు,సాల్ట్ ,కారమ్ ,పసుపు వేసి కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చెయ్యాలి.
వేడి తగ్గాక కుక్కర్ మూతతీసి స్టవ్ వెలిగించి గరిటతో పప్పుతిప్పుతూ ఉండాలి. ప్రక్కన తాలింపుకు చిన్న మూకుడు పెట్టి దానిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కొంచెం వేడిఅయ్యాక దానిలో ఆవాలు,జీలకర్ర,ఇంగువ , కరివేపాకు వేసి దీనిని పైన పప్పులో వేసి గరిటతో తిప్పాలి . దానిలో నిమ్మకాయ రసం పిండాలి. నిమ్మకాయ పడనివారు కొంచెం చింతపండు గుజ్జు కలుపుకోవచ్చు.దానిని తీసి వక బౌల్లో వేసుకోవాలి. చాల కమ్మగా ఉంటుంది.
2 comments: