Friday, April 26, 2019

Maida pindi Sampengalu,Panasathonalu,Gulabeelu

కావలసినవస్తువులు       :

మైదాపిండి              :   1/2 కేజీ
సాల్ట్                         :  1 చిటెకెడు
పంచదార                :   1/2 కేజీ
యా లుకలపొ డి     :  1 స్పూన్
వాటర్                      :  కొంచెం

తయారుచే యువిధానము       :

 1.
ముందుగా   స్టవ్ వెలిగించి  గిన్నెలో పంచదార వేసి కొంచెం వాటర్ వేసి  పెట్టాలి.  అదికరిగాక
 లేతపాకం వచ్చాక  స్టవ్ ఆఫ్ చేసి అది ప్రక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ లోకి మైదా వేసి , సాల్ట్ వేసి , కొంచెం కొంచెం వాటర్ వేసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. బాగా కలిపాక పిండి వేసుకొని  చిన్న చపాతీ  లాగా చేసుకొని , చపాతీకి మధ్యలో చివరలు కట్ అవ్వకుండా కత్తి తో గాటు  పెట్టాలి.  అక్కడనుండి చివరివరకు కట్ చేసుకోవాలి. .ఆచివరనుండి మడతపెట్టి
రెండు అంచులు కలిపి ప్రెస్ చేసి పైకి తీస్తే  పనసతొనలగా వస్తుంది. దానిని ఆయిల్ లో ఒకొక్కటి వేయించి పాకం లో వేసి అటుఇటు తిప్పి ముంచి తీసెయ్యాలి.
 2.
  అట్లాగే  పెద్దచపాతి చేసి పెద్ద మూతవి 2 రెండు , దానికన్నా చిన్న మూతవి ఒకటి  కట్ చెయ్యాలి. కింద పిండి వేసి పెద్దరౌండ్  చపాతీ పెట్టి , దాని మీద కొంచెం పిండి వేసి ఇంకొక పెద్ద రౌండ్ చపాతీ పెట్టి, దాని మీద  పిండి వేసి దానిమీద చిన్న చపాతీ  పెట్టి మధ్యలో కొంచెం వేలితో నొక్కి ఉంచాలి. పెద్దచపాతీలో పైన మూడు చపాతీలు తీసాక సైడ్ ముక్కలని  చిన్న పీసిని  కొంచెంపొడవుగా  కట్ చేసి రౌండ్ గ  చుట్టాలి. అది గులాబీకి మధ్యలో బడ్ లాగా ఉందికదా .దీనిని పైన ఒకదాని మీద ఒక చపాతీలు 3 పెట్టాము కదా దాని మధ్యలో కొంచెం తడి చేసి పెట్టాలి .అప్పుడు మూడు చపాతీలా మధ్య దానిని పెట్టాక  ఆ చపాతీని సమానంగా 3 పీసెస్  అయ్యాటట్టు గ 2 చోట్ల  కట్ చెయ్యాలి.   ఒక పొరకి కొంచెం తడి చేసి బడ్ చుట్టూ  తిప్పి
 అం టించాలి.    అట్లాగే  ఒక  దాని తరవాత ఒకటి పెట్టి రెక్కలుగా  చెయ్యాలి  అది గులాబిలాగా వస్తుంది .
3. 
అట్లాగే   ఒక చపాతీ చేసి దానిని  4  బాగాలుగ  చేసి  ఒకొక్క భాగాన్ని సైడ్ నుండి దగ్గరికి చేతితో ప్రెస్ చేస్తాము.  నాలుగు రెక్కలుగా వస్తుంది. రెండు రెక్కలని ప్రక్క ప్రక్క పెట్టి కింద చేతితో కలిపి ,అట్లాగే మిగిలిన రెం డు రెక్కలని కూడా  కలపాలి. రెండు రెండు రెక్కలని  రివర్స్ లో కలిపి  నాలుగు భాగాలని కలిపి ప్రెస్ చెయ్యాలి  ఆయిల్ లో వెయ్యగానే సంపెంగలులాగా పొంగుతాయి. వాటిని పాకంలో వేసి తిప్పి వెంటనే  తియ్యాలి 










No comments:

Post a Comment