Friday, April 26, 2019

Bellam Pongadalu

కావలసిన వస్తువులు          :

బియ్యం                :  1 కేజీ ( 24 గంటల ముందు నానబెట్టి  వడకట్టి నీరు అంత పోయాక మిక్సీ పట్టి మెతగ్గా జల్లించి  ఉంచాలి )
బెల్లం                    :  3/4 కేజీ( దీని ప్రకారం రైస్  బెల్లం వేసుకోవాలి )
యాలకుల పొడి   :  కొంచెం
నెయ్యి                   :  4  లేదా  5 స్పూన్స్
ఆయిల్                 : 1/2 కేజీ
కొబ్బరి కాయ        :   1 ( కోరి కొంచెం నేతిలో వేయించి ఉంచాలి)

తయారుచేయువిధానము    :

బియ్యంపిండి రెడీ  అయిన  వెంటనే   మనం బెల్లం కొబ్బరి పొంగడాలు చేసెయ్యాలి.  ముందుగా  స్టవ్ మీద  గిన్ని  పెట్టి గిన్నెలో బెల్లంవేసి కొంచెం వాటర్ వేసి మరగనివ్వాలి . కాసేపటికి చిన్నగిన్నెలో వాటర్ వేసి దానిలో బెల్లం పాకం కొంచెమువేసి ఉండపాకం లాగా వచ్చేవరకు  చూడాలి. ( చాల జాగర్త గ)  . కొంచెం వాటర్ చిన్న గిన్నెలో తీసుకొని రెడీ గాఉండాలి.  మరగిన పాకం వాటర్ ఉన్న గిన్నెలో వేసి చేతితో కలిపితే  దగ్గరికి అవుతుంది .  అప్పటివరకు  పాకాన్ని తిప్పి చూసుకుంటూ ఉండాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి వేసి , బియ్యం పిండి కొంచెం కొంచెం వేస్తూ గరిటతో తిప్పాలి. యాలకుల పొడి కూడా వెయ్యాలి. మరీ దగ్గరికి ముద్దగా కాకుండా మరీ లూస్  గ కాకుండా ఉండే వరకు పిండి ని వేసి తిప్పాలి. ఈలోపు కొంచెం వాటర్ ని మరిగించి గోరువెచ్చగా  ఉన్నప్పుడు   ఆనీళ్ళని   పైన పిండి లో వేసి గరిట జా రుగ కలపాలి . అదికూడా  ఆయిల్ లో  వేసినప్పుడు మరి పాకకుండా ఉండే టట్టు గ    వెయ్యాలి . స్టవ్  మీద మూకుడు పెట్టి  ఆయిల్ వేసి మరిగాక గుంట గరిటతో  ఒక్క గరిట తో పిండి తీసి  మద్యలో  వెయ్యాలి. 2 నిమిషాలలో  పైకి పొంగుతూ వస్తుంది . అప్పుడు రెండవ  వైపు  తిప్పాలి.
అట్లా అన్నీ  ఒకొక్కటి వేసి మంచి కలర్ గ  ఉడికేటట్టు వేసుకోవాలి. ఇవి చాల టేస్టుగా  చాలరుచిగా,చాలారోజులు నిల్వ కూడా ఉంటాయి.  బెల్లం కాబట్టి ఆరోగ్యానికి  కూడా  మంచిది.

గమనిక   :    దీనిలో కొంచెం కొబ్బరి,  కొంచెం బొంబాయి రవ్వ   కూడా  వేసుకుంటే  కూడా చాల
టేస్ట్  గ కూడా ఉంటుంది. పాకంలో పిండి  వేసే టప్పుడు  ఒక వేళ పిండి మనకి  చాలనప్పుడైనా  బొంబాయి రవ్వ కలుపుకోవచ్చు.  కంగారు పడకూడదు. చాలాబాగుంటుంది.










No comments:

Post a Comment