Sunday, April 7, 2019

Semiya Upma

SEMIYA UPMA


కావలసిన వస్తువులు  :

సేమియా               : 1 కప్ (కొంచెం వాటర్ లో సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉడికించి  జల్లెడలో  వేయాలి)
ఆనియన్               :  1(కట్ చేసిఉంచాలి)
పర్చిమిర్చి             : 4 కానీ 5 (కట్ చేసి ఉంచాలి)
క్యారట్                    : 1 స్మాల్ (కోరుకొని ఉంచాలి)                       
వేరుశెనగపప్పు      : కొంచెం ,జీడిపప్పు కూడా వేసుకోవచ్చు
టమాటో                  : 1 (కట్ చేసి ఉంచాలి)
నిమ్మకాయ             : 1(స్మాల్ సైజు)
తాలింపుకు             : 1స్పూన్ ఆవాలు,1స్పూన్ సెనగపప్పు, కరివేపాకు 2 రెబ్బలు
ఆయిల్                   : 3 స్పూన్స్
కొత్తిమీర                  : కొంచెం

తయారుచేయువిధానము   :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాలి. దానిలో  ఆయిల్   వేసి మరిగాక  ఆవాలు,సెనగపప్పు,కరివేపాకు వెయ్యాలి. తరువాత వేరుశెనగపప్పు,
ఆనియన్ ముక్కలు,పర్చిమిర్చి ముక్కలు, వెయ్యాలి. కొంచెం వేగాక టమాటో ముక్కలు వేసి ,వన్ మినిట్ తరువాత  క్యారట్   కూడా వెయ్యాలి . సాల్ట్ కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి . ఎంధుకంటే  సేమియాలో ఉడికేట ప్పుడు  కొంచెం వాటర్ లో వేస్తాము కాబట్టి చూసుకొని వెయ్యాలి. కొంచెంవేగాక  సేమియాని వేసేయాలి.     
కొంచెం తిప్పాక   నిమ్మకాయ రసం పిండి
కొంచెం కొత్తిమీర వేసి తిప్పి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. తీసే  ముందు  ఒక స్పూన్ గరంమసాలా వేసుకున్న  బాగుంటుంది .  బౌల్ లోకి తీసుకోవాలి. 

                                                         









No comments:

Post a Comment