Monday, April 22, 2019

Palakoora pappu



కావలసినవస్తువులు   :

పాలకూర       : 4 లేదా 5 కట్టలు ( సు బ్బరంగా కడిగి కట్ చేసి ఉంచాలి)
ఆనియన్       :  1 ( చిన్న ముక్కలుగా కట్ చేసిఉంచాలి)
పర్చిమిర్చి     :  2 ( కట్ చేసి ఉంచాలి)
సాల్ట్                :  1 స్పూన్
కారం               :  1 స్పూన్( కావాలంటే   కొంచెం ఎక్కువుగా కూడా వేసుకోవచ్చు)
టొమాటోస్      :  2 లేదా 3 ( కట్ చేసి ఉంచాలి)
పసుపు            "  1 స్పూన్
కందిపప్పు      :  1 చిన్న కప్ ( కడిగి ఉంచాలి)
కరివేపాకు       :  1 రెబ్బ
వెల్లుల్లి            :  4లేదా 5 రెబ్బ లు
నిమ్మకాయ     :  1/2 చెక్క సరిపోతుంది
తాలింపు         :   1  స్పూన్, జీలకర్ర  1 స్పూన్, మినపప్పు 1 స్పూన్
ఆయిల్           :   3 స్పూన్స్



తయారీవిధానము    :

ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి , ఆయిల్ వేసి , వెల్లుల్లి వేసి , తాలింపు , కరివేపాకు కూడా వేసి , ఆనియన్స్ కూడా వేసి, పర్చిమిర్చి కూడా వేసి,  టమాటో ముక్కలు వేసి,తిప్పి పాలకూర కూడా వేసి, సాల్ట్ ,కారం, పసుపు వేసి కాసేపు తిప్పి కందిపప్పు కూడా వెయ్యాలి .  1  కప్ కందిపప్పు  కి 2 కప్స్ వాటర్ వెయ్యాలి.కుక్కర్ మూత  పెట్టి 3 లేదా 4 విజిల్స్  వచ్చాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.   10 నిమిషాల తరవాత విజిల్ తీసి స్టవ్ ఆన్ చెయ్యాలి .గరిటతో కలుపుతూ 1/2 చెక్క ని మ్మరసం పిండి , కాసేపు తిప్పి కొంచెం దగ్గరికి అయ్యాక  తీసే  ముందు 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తే  చాల టెస్ట్ గ   ఉంటుంది.  పులుపు చాలక పొతే  ఇంకొక 1/2 చెక్క కూడా  రసం తీసి  వెయ్యవోచ్చు సాల్ట్ కూడా  చూసుకుంటూ ఉండాలి చాలకపోతే  కొంచెం వెయ్యాలి.




No comments:

Post a Comment