Sunday, April 21, 2019

Chicken Biriyani

వలసిన వస్తువులు     : 

చికెన్                         :  1/2 కేజీ ( శుభ్రంగా కడిగి ఉంచాలి)
ఆనియన్స్                :  2 ( కట్ చేసి ఉంచాలి)
పర్చిమిర్చి                :    2 లేదా 3( చీలికలుగు కట్ చెయ్యాలి)
టమాటో                    :  2 చిన్నవి( కట్ చేసి ఉంచాలి)
అల్లం                        : 2 అంగులాల ముక్క
వెల్లుల్లి                      :  1 పెద్దపాయాయి( అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఉంచుకోవాలి)
మసాలాదినుసులు  : లవంగాలు  4,యాలకులు 4, దాచినచెక్క చిన్నవి 2, జాపత్రి కొంచెం,
మరటిమొగ్గ   2, బిరియాని ఆకు 4
కొత్తిమీర                    :  2 కట్టలు (చిన్నవి  3  ఐనా వేసుకోవచ్చు )
పొదీన                        :  2 కట్టలు ( లేదా 3 వేసిన వేసుకోవొచ్చు)
బిరియాని రైస్           :  2 గ్లాస్ ( 1/2 కేజీ)( కడిగి 1/2 గంట అయినా ముందుగా నానబెట్టాలి)

సాల్ట్                           : 2 స్పూన్స్
కారం                           : 3 స్పూన్స్ ( మనము  చూసుకోని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు)
పసుపు                        : 1 స్పూన్
జీలకర్ర పొడి              : 2 స్పూన్స్
గరం మాసాల             : 3 స్పూన్స్
నెయ్యి                         : 4 స్పూన్స్
బట్టర్                          : కొంచెం 
పెరుగు                        : 5 స్పూన్స్

తయారుచేయువిధానము   :

ముందుగా     ఒక  బౌల్ లో  చికెన్, సాల్ట్  కా రం, పసుపు పెరుగు  , అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ వెయ్యాలి,కొంచెం కొత్తిమీర,  కొంచెం పొదీనా కూడావేసి కలిపి , 1/2 జీలకర్రపొడి,1/2 మసాలాపొడి కూడావేసి  ( 1/2 గంట అయినా ఉంచాలి). స్టవ్ మీద  బిరియానికి   గిన్నె పెట్టుకొని నెయ్యివెయ్యాలి . (ఈలోపు ప్రక్క న వాటర్ మరగా పెట్టుకుంటూ ఉండాలి. వాటర్ కాగాక రైస్ వేసి కొంచెం సాల్ట్ వేసి, సోంపుకూడా 1 స్పూన్ వెయ్యాలి  . కొంచెం పొదీనా కొత్తిమీర రైస్  ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది.   )మసాలా దినుసులు  వెయ్యాలి   వెంటనే ఆనియన్స్,పర్చిమిర్చి, సాల్ట్ వేసి, పసుపు కూడా వేసి కాసేపటికి టొమాటొకూడా వేసి కొంచెం మగ్గాక చికెన్  ని వెయ్యాలి. 5 నిమిషాలు కలిపి కొంచెం దగ్గరికి అవుతుంది అనగా కారం, జీలకర్రపొడి అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొత్తిమీర కొంచెం ,పొదీనా కొంచెం ,బిరియాని ఆకు వేసి  కొంచెం  వాటర్ గ ఉన్న పర్లేదు ప్రక్కన 70% ఉడికిన రైస్ ని వడకట్టి న గరిటతో  తీసి ఈ చికెన్ మీద వేస్తూ ఉండాలి చికెన్ కనపడకుండా పరవా లి . అట్ల  మొత్తం రైస్ ని వడకడుతూ వేసి మధ్య లో రైస్ మీద కొత్తిమీర, పొదీనా కూడా వేస్తూ ఉండాలి. అంత వేసాక రైస్ పైన బట్టర్ కొంచెం చిన్న పీసెస్ గ  అక్కడక్కడ  వేసి గ్లాస్ లిడ్ పెట్టి . పైన లీక్ లేకుండా చిన్న నాప్కిన్ జాగర్తగా మంటకి తగలకుండా లిడ్ మీద వెయ్యాలి. చిన్న మంట  మీద  8  నిమిషాలు ఉంచి ఒక సా రి చూసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.  తీసే  ట ప్పుడు  జాగర్త గ అడుగునుండి పైకి తిరగ వేసి వడ్డించుకోవాలి.  వీడియో లో లాగా .





No comments:

Post a Comment