Monday, April 29, 2019

Beerakaya Kobbari Roti Pachhadi

కావలసినవస్తువులు    :

బీరకాయలు       : 1/2 కేజీ ( కొంచెం పీల్ చేసి కట్ చేసి ఉంచుకోవాలి)
పర్చిమిర్చి          :  8 లేదా 10( కారాన్ని బట్టి )
కొబ్బరి                 :  4 చిన్న ముక్కలు
వెల్లుల్లి                :   10 రెబ్బలు
జీలకర్ర               :  1 1/2 స్పూన్
చింతపండు       :   చిన్ననిమ్మకాయలో సగం
సాల్ట్                    : సరిపడ
ఆయిల్               : 4 స్పూన్స్
కొత్తిమీర              :  ఒక  కట్ట ( కడిగి సన్నగా కట్ చేసుకోవాలి)

తయారుచేయువిదానము    :


ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి   బీరకాయ ముక్కలు ,ఆయిల్ పర్చిమిర్చి వేసి , వేగనివ్వాలి, వేగిన వెంటనే కొబ్బరి,వెల్లుల్లి, జీలకర్ర,చింతపండు , కొత్తిమీర వేసి  కాసేపు తిప్పి స్టవ్ ఆఫ్ చేసి ,చల్లారాక ముందుగా మిక్సీలో  కొబ్బరిముక్కలు వేసి గ్రైండ్ చేసాక మిగిలినవి వేసి సాల్ట్ వేసి మిక్సీపట్టాలి .  దానిని బౌల్ లోకి తీసుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్లు ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి కలుపుకోవచ్చు 

No comments:

Post a Comment