Monday, April 29, 2019

Potli Sweetcorn Samosa

కావలసినవస్తువులు    :

మైదా                :  200గ్ర
ఆయిల్            :   4 స్పూన్స్
సాల్ట్                 : 1/2స్పూన్ ( సరిపడా)
పొటాటోస్        : 1/4 కేజీ ( కూకర్లో వాటర్ వేసి,పొటాటోస్ వేసి  వాటిని 4లేదా 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచి కట్టెయ్యాలి ,  చల్లారాక  వాటి ఫై పోరని  తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
స్వీట్ కార్న్      : 1 కప్
ఆనియన్         :  1 ( సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి       : 3 ( సన్నగా కట్ చేసుకోవాలి)
కారం                 : 1 1/2 స్పూన్
పసుపు              :  1/2 స్పూన్
సోంపు               : 1 1/2 స్పూన్
జీలకర్ర            ;  1 స్పూన్
ఆంచూర్ పొడి   :  1 స్పూన్
చాట్ మసాలా    :  1 స్పూన్
గరంమసాలా     :  1 స్పూన్
ధనియాలు        :  1 స్పూన్ ( కొంచెం చేతితో నలపాలి)
కొత్తిమీర             :  కొంచెం
అల్లం                 : 1/4 స్పూన్( తరిగినది)
ఆయిల్              :  4 స్పూన్స్
ఆయిల్              : 1/4 కేజీ ( సమోసా వేయించడానికి)

తయారుచేయువిధానము       :


ముందుగా  మైదా ని  జల్లించి  ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దానిలోకి సాల్ట్, ఆయిల్ వేసి( 4 స్పూన్స్) బాగా కలిపి చేతితో గట్టిగ పట్టుకుంటే  ఉండాలా గ  రావాలి.  అప్పుడు కొంచెం కొంచెం 
వాటర్ వేసి  చపాతీ పిండిలాగా  గట్టిగ కలుపుకోవాలి. మూత  పెట్టి  1/2 గంట వొదిలేయాలి. 
ఈలోపు   స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి ( 4 స్పూన్స్) ఆవాలు , జీలకర్ర,సోంపు, ధనియాలు, అల్లం, ఆనియన్స్,పర్చిమిర్చి, స్వీటీకార్న్,సాల్ట్,పసుపు వేసి ,కొంచెంవేగాక  పొటాటో  వేసి కొంచెం తిప్పాక  కారం,చాట్ మసాలా  ,ఆంచూర్ పొడి,  గరం మసాలా , లాస్ట్ లో కొత్తిమీర  వేసి కాసేపు తిప్పి ప్రక్కన పెట్టుకోవాలి. 
ఇప్పుడు మైదా మీద   మూత  తీసి  పిండిని బాగా కలిపి చిన్న చిన్న  ఉండతీసుకొని  చపాతీ లాగా చేసి  మధ్యలో పైన ఆరిన కూరని పెట్టి కూర చుట్టూ  కొంచెం చెయ్యి తడి చేసి చుట్టూ రాయాలి. చపాతి అంచులు పట్టు కొని  మెల్లి మెల్లిగా ఫోల్డ్ చేస్తూ  మొత్తం చుట్టూ చెయ్యాలి చేసాక ఫోల్డ్ చేసిన భాగాన్ని కొంచెం పట్టుకొని గట్టిగ  నొక్కాలి. కూర చుట్టూ వాటర్ రాసమ్  కాబట్టి మనం నొక్కినప్పుడు  అక్కడ అతుకుంటుంది.  పైన పువ్వులాగా వస్తుంది.  అన్నింటిని  అట్లా చేసి  స్టవ్ మీద  మూకుడు పెట్టి  ఆయిల్ వేసి (1/4కేజీ) సమోసాలని 4 లేదా 5 చొప్పున  సన్నటి సెగ మీద వేసి వేయించుకోవాలి.  అట్లా  తిన్నా   బాగుంటాయి,లేదా టమాటో కెచప్  తో కొందరు తింటారు. అది  కూడా బాగుంటుంది. 






No comments:

Post a Comment