Monday, April 29, 2019

Gunta Pongadalu

కావలసినవస్తువులు     :

దోసెలా  పిండి            :  1 పెద్ద కప్
ఆనియన్స్                  :  1( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి                  :   3 ( సన్నగా, చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి)
కొత్తిమీర                      :   కొంచెం
సాల్ట్                            :   సరిపడ


తయారుచేయువిధానము    :

ముందుగా   ఒక బౌల్ లోకి దోసలపిండి,ఆనియన్స్,పర్చిమిర్చి కొత్తిమీర, సాల్ట్, అన్నీకలిపి రెడీ గ ఉంచుకోవాలి.  పొంగడాలు వెయ్యడానికి  గుంట లుగా  ఉన్నది  ఇనపది కానీ,నాన్ స్టిక్ 
కానీ  మార్కెట్లో  దొరుకుతుంది .  దానిలో కొంచెం ఆయిల్ వేసి అన్ని గుంటలకి   చేతితో ఆయిల్ రాయాలి . దానిని స్టవ్  మీద పెట్టి ఆ గుంటలలో పిండి ని వేయాలి. పైన మూత పెట్టాలి. 5 నిమిషాలలో స్పూన్ తో వాటిని జాగర్తగా తిరగవేయాలి. మల్లి మూత పెట్టి  4 నిమిషాలలో అన్నింటిని ప్లేటులోకి తీసుకోవొచ్చు.  

గమనిక   

 దోసెల  పిండి కి కొలతలు   1 గ్లాస్ మినపప్పుకి, 2 గ్లాసుల రైస్   విడివిడిగా  నానబెట్టి 6 గంటలతరవాత  ముందు మినపప్పు మిక్సీ  పట్టి  తీసి,తరువాత  బియ్యం కొంచెం రుబ్బిన మినపప్పు కొంచెం వేసి రుబ్బితే  మెత్తగా పిండి వస్తుంది. మల్లి మిగిలిన బియ్యం  రుబ్బిన మినప పిండి  కలిపి మల్లి మిక్సీ చేస్తే  సరిపోతుంది. లేదా వెట్ గ్రైండర్లో రెండూ కలిపి వేసిన గ్రైండ్ అవుతుంది.     


No comments:

Post a Comment