Tuesday, April 16, 2019

Beerakaya Senagapappu, Kobbari curry

కావలసిన వస్తువులు     :


బీరకాయలు          :  1/2 కేజీ ( పీల్ చేసి కావలసిన సైజు లో ముక్కలు కట్ చేసుకోవాలి)
సెనగపప్పు            :  50 గ్రా
కొబ్బరి                    :  1/2 చెక్క( కోరుకొని ఉంచాలి)
పర్చిమిర్చి             :  2(కట్ చేసుకొని ఉంచాలి)
ఆనియన్               :  1( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కా రం                      : 1 స్పూన్
పసుపు                     : 1/2 స్పూన్
అల్లం                      : చిన్న ముక్క
వెల్లుల్లి                    : 6 లేదా 7 రెబ్బలు ( అల్లం ,వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి)
గరం మసాలా         : 1 స్పూన్
సాల్ట్                        : 1 1/2 స్పూన్
కరివేపాకు               : 2 రెబ్బలు
ఆయిల్                   : 4 స్పూన్స్
తాలింపు                 :  ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినపప్పు  1 స్పూన్

తయారువిధానము    :                   


ముందుగా   మూకుడులో సెనగపప్పుని  కడిగి వన్ గ్లాస్ వాటర్  వేసి   స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. ఒక ఉడుకు రాగానే ఆనియన్స్,పర్చిమిర్చి వెయ్యాలి బీరకాయముక్కలు కూడా  వెయ్యాలి. అవి ఉడుకుతుండగా  అల్లం వెల్లుల్లి పేస్ట్  వెయ్యాలి. సెనగపప్పు ఉడికిందో లేదో చూసి లేదంటే  ఇంకా కొంచెం వాటర్ వెయ్యవోచ్చు .సెనగపప్పు ఉడికాక  వరసగా సాల్ట్,కారం,పసుపు, కొబ్బరి,మాసాల  కూడా వేసి  కూర వాటర్ లేకుండా  చూసుకోవాలి. ప్రక్కన వేరే మూకుడులో కొంచెం ఆయిల్ వేసి కాగాక తాలింపు వేసి 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసి, పైన తాలింపుని  కూరలో వేసి , 1/2 చెక్క నిమ్మకాయ  రసం  పిండి కూర తిప్పి బౌల్ లోకి తీసుకోవాలి. 



No comments:

Post a Comment