Monday, April 29, 2019

Beet Root roti pachhadi

కావలసిన వస్తువులు     :

బీట్రూట్                         :   2 ( పీల్ చేసి  కట్ చేసి ఉంచాలి)
ధనియాలు                     :  2 స్పూన్స్
సెనగపప్పు                     :  2 స్పూన్స్
మినపప్పు                       :  1 స్పూన్
ఎండుమిరపకాయలు   :    7 లేదా  8
వెల్లుల్లి                           :  7 లేదా 8 రెబ్బలు
చింతపండు                  :  కొంచెం ( చిన్న నిమ్మకాయ కన్నా తక్కువ)( గోరువెచ్చటి  వాటర్ లో నానబెట్టాలి)
సాల్ట్                               :  సరిపడ
ఆయిల్                          : 2 స్పూన్స్


తయారుచేయువిధానము    :

ముందుగా   స్టవ్  వెలిగించి  మూకుడు పెట్టి  1 స్పూన్ ఆయిల్ వేసి సెనగ పప్పు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర 1 స్పూన్ , ఎండుమిర్చి  వేయించి, మిక్సీపట్టి  ఉంచాలి . ఈలోపు  వేరే  మూకుడు  స్టవ్ మీద పెట్టి  బీట్రూట్  ముక్కలు  2 స్పూన్స్  ఆయిల్ వేసి  వేయించాలి.     వేగాక వెల్లుల్లి కూడా వేసి కాసేపు తిప్పి  , చింతపండు, సాల్ట్  వేసి కొంచెం చింతపండులో వాటర్ కూడా వేసి మిక్సీ పట్టి  ,  దానిలో పైన మిక్సీ చేసిన పొడిని కలపాలి.  సాల్ట్ చూసుకొని చాలకపోతే
కొంచెం  వేసి ,కొంత మంది తాలింపు వేసు కుంటారు. నేను వెయ్యలేదు. 



No comments:

Post a Comment