కావలసిన వస్తువులు :
బెండకాయలు : 1/2 కేజీ ( కడిగి ఆరబెట్టి తడిలేకుండా కట్ చేసుకోవాలి)
ఆనియన్ : 1( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు : 2 రెబ్బలు
కారానికి : (4 ఎండుమిరపకాయలు,6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర) వీటిని మిక్సీ చేసి ఉంచాలి)
తాలింపుకు : ఆవాలు 1 స్పూన్ ,వేపిన సెనగపప్పు 1 స్పూన్ ,మినపప్పు 1 స్పూన్ వెల్లుల్లి చిదిమినవి 2, ఎండుమిరపకాయ 1,
పసుపు : 1 స్పూన్
సాల్ట్ : 1 స్పూన్
ఆయిల్ : 3 స్పూన్స్
తయారు చేయు విధానము :

ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కాగాక ఆయిల్ వెయ్యాలి. కాగాక తాలింపు వెయ్యాలి. వేగాక ఆనియన్స్ వెయ్యాలి,కాసేపు తిప్పా క . బెండకాయలు వెయ్యాలి. పసుపు వెయ్యాలి మూతపెట్టకుండా సన్నటి సెగ మీద ఉంచి తిప్పుతూ ఉండాలి. దగ్గరికి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి 10 లేదా 12 వేసు కుంటే కూర చాల కమ్మగా కూడ ఉంటుంది. కాసేపు తిప్పి , దగ్గరికి అయ్యాక పైన ఉన్న కారాన్ని , సాల్ట్ ని వేసి సాల్ట్ ,కా రం చూసుకొని మల్లి వేసి కూర తిప్పి బౌల్ లోకి తియ్యాలి.
No comments:
Post a Comment