Sunday, April 7, 2019

Soya Chunks Biriyani

కావలసిన వస్తువులు        :

సొయా చంక్స్                 :  1 కప్
బాసుమతి రైస్                :  1 కప్
అల్లం వెల్లులి పేస్ట్        :  2 స్పూన్స్ ( చిన్న అల్లం ముక్క,అండ్ వెల్లుల్లి రెబ్బలు 8)
గరంమసాల                    :  2 స్పూన్స్
కారం                                 : 3 స్పూన్స్
ఆనియన్                          :  1 పెద్దది ( సన్నగా నిలువుగా కట్ చేసుకోను ఉంచాలి)
టమాటో                            :  1 పెద్దది లేదా చిన్నవి 2 ( సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి                        : 4( చీలికులుగా కట్ చేసుకోవాలి)
పసుపు                               : 1 స్పూన్
తాలింపుకు                       : యాలకులు 4, దాచినచెక్క చిన్నది  ,లవంగాలు 6,బిరియా ని ఆకూ 3
పొదీనా                               : గుప్పెడు ( కొంచెం ఎక్కువ అయిన పర్వాలేదు)
కొత్తిమీర                              : గుప్పెడు  ( కొంచెం ఎక్కువ అయిన పర్వాలేదు)
ఆయిల్ కానీ నెయ్యి         :  5 స్పూన్స్
బట్టర్                                 : 1 క్యూబ్                 







తయారుచేయు విధానము        :

అరగంటముందు  బాసుమతి రైస్ ని వాటర్ లో నానబెట్టాలి. సొయా చంక్స్   ని మరుగుతున్న  వాటర్ లో ఉడకబెట్టి,వార్చుకొని ఉంచుకోవాలి.


ముందుగా స్టవ్ ని వెలిగించి గిన్నె  పెట్టి   దానిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ మన వీలుని బట్టి వేసుకోవాలి. మరిగాక తాలింపు దినుసులు వేసి,  దానిలో ఆనియన్స్,పర్చిమిర్చి వేసి, తిప్పాక సాల్ట్ పసుపు కూడా వేసి తిప్పి ,  అల్లం వెల్లుల్లి  పేస్ట్ కూడా వెయ్యాలి. టమాటో ముక్కలు కూడా వేసి కా రం ,గరంమసాలా కూడా వేసి   తిప్పి సొయా చంక్స్  కూడా వేసి తి ప్పాలి 
 ఈలోపు మనం మరుగుతున్న  వాటర్ లో  బాసుమతి రైస్ వేసి ఉడికించుకోవాలి .  ఉడికేట ప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి .రైస్ కి సాల్ట్ సరిపోయింద లేదా కూడా చూసుకోవాలి.  దానిలో కొంచెం సోంపు,పొదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు 75 పర్సెన్ట్  బాయిల్  అయిన  రైస్ ని  వడకట్టి  పైన కర్రీ మీద పలచగా వెయ్యాలి.
 దాని మీద ఇంకొక లేయర్ గ పూర్తిగా బాయిల్ అయినా రైస్ ని వేసి  పైన కొంచెం బట్టర్ ని చిన్న చిన్న ముక్కలుగా వేసి,టైట్ మూత పెట్టిపెట్టాలి. వీలుని బట్టి 1/2 చెక్క నిమ్మకాయ కూడా రసం పిండు కోవచ్చు. వేడి వేడి గ తింటె చాల మంచిది. ఆరోగ్యానికి కూడా సొయా మంచిది.



                                                                 


                              





No comments:

Post a Comment