Wednesday, April 3, 2019

BOMBAI RAVVA ,KOBBARI LADDU

Bombai Ravva Kobbari Ladduబొంబాయిరవ్వ , కొబ్బరి లడ్డు 


కావలసిన వస్తువులు    :

కొబ్బరి చిప్ప       : 1/2 చెక్క ( కోరివుంచాలి)
బొంబాయి రవ్వ : 1 కప్                                                             
పంచదార             : 1 కప్
పాలు                      : కొంచెం (అవసరానికి సరిపడా)
యాలకుల పొడి   : 1 స్పూన్
నెయ్యి                     : 4 స్పూన్స్
జీడిపప్పు                : కొంచెం


తయారువిధానము   :   

ముందుగా  స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ ఆన్ చేసి  దానిలో కొంచెం నెయ్యి వేసి  ముందుగా జీడిపప్పుని  వేయించి ప్రక్కన పెట్టుకొవాలి.  ఆ మూకుడులోనే  కొంచెం నెయ్యివేసి ముందుగా రవ్వని కొంచెం వేయించాలి. దానిలోనే పంచదార వేసి ఒక నిమిషము తిప్పి ,కొబ్బరికూడా వేసి  తిప్పుతూ, కొంచెం పా లు కూడా వేసి తిప్పి,  జీడీ పప్పు, యాలకులపొడి కూడా వేసి కొంచెంసేపు తిప్పి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.  వాటిని  ఉండలుగా చుట్టుకోవాలి .  ఎంజాయ్ చేస్తూ తినాలి . చాల రుచిగా  ఉంటాయి.





No comments:

Post a Comment