Wednesday, April 3, 2019

EGG CURRY

కోడిగుడ్డు కూర 

కావలసిన వస్తువులు          :

ఎగ్స్                           :  4 (ఉడికించి ప్రక్కన పెట్టుకోవాలి)
ఆనియన్                   :  1 పెద్దది (చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం గ్రైండ్ చేసుకొని ఉంచాలి)
టొమాటోస్                 :   2 పెద్ద వి (కట్ చేసి వాటినినికూడా కొంచెం  గ్రైండ్ చేసుకొని  ఉంచాలి) 

పర్చి మిర్చి                :   2 (కట్ చేసి ఉంచాలి)
అల్లం                         :   చిన్న ముక్క
వెల్లుల్లిరెబ్బలు         :   8 (అల్లం, వెల్లులి  గ్రైండ్ చేసుకొని ఉంచాలి)
కరివేపాకు                 :   2 రెబ్బలు
కొత్తిమీర                     :  కొంచెం
కా రం                         :  1 స్పూన్
పసుపు                       :  1/2 స్పూన్
సాల్ట్                           :  1 స్పూన్
చింతపండు              :  చిన్న నిమ్మకాయ సైజు (కొంచెం వాటర్ వేసి రసం తీసి ఉంచాలి)
పోపుదినుసులు         :  ఆవాలు,జీలకర్ర,2 యాలకులు ,2లవంగాలు ,బద్దమైనపపప్పు 1/2  స్పూన్                                            
గరంమసాల               : 1/2 స్పూన్ 


తయారువిధానము :

ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాలి . దానిలో ఆయిల్ వేసి మరిగాక పోపుదినుసులు  వేసి తరువాత కరివేపాకు వేసి తరువాత ఆనియన్ పేస్టూ వేసి ,కొంచెం సాల్ట్ ,పసుపు వేసి కాసేపు తిప్పి  ,పర్చిమిర్చీకూడావేసి,అల్లం,వెల్లుల్లి పేస్ట్ వెయ్యాలి,తరువాత టమాటో ముద్ద వేసి,మసాలాకూడావెయ్యాలి. చింతపండు వాటర్ కూడా వేసి తిప్పాలి. అవసరం అనుకుంట్  కొంచెం వాటర్ వెయ్యాలి. కొంచెం వేగాక ఎగ్స్ ని కూడా వెయ్యాలి.  మూతపెట్టి కాసేపటి తరవాత మూత తీసి కూర ఉడికిందికదా కొంచెం కొత్తిమీర  మీర చల్లి  తిప్పి బౌల్ లోకి తీసుకోవాలి.  


 










1 comment: