Sunday, April 21, 2019

Kobbari Annam

కావలసిన వస్తువులు    :

బిరియాని రైస్            :   1 గ్లాస్ ( 1/4 కేజీ)( కడిగి నానబెట్టి ఉంచాలి)
కొబ్బరి చెక్కలు          :   2( వాటిని కోరి కొంచెం వాటర్ వేసి వడ కట్టి 2 గ్లాస్ లు ఉండాలి)
పర్చిమిర్చి                  :  4 లేదా 5( చీలికలు చెయ్యాలి)
జీడిపప్పు                    :  కొంచెం
నెయ్యి                         :  3 స్పూన్స్
మసాలాదినుసులు    :  లవంగాలు  3, యాలకులు  3,  దా చినచెక్క : చిన్నది, మరటిమొగ్గ            చిన్నది                                 
బిరియాని ఆకు            :  2
సాల్ట్                              : 11/2 స్పూన్

తయారీవిధానము     :

ముందుగా  స్టవ్  వెలిగించి  కుక్కర్ పెట్టి  నెయ్యి వెయ్యాలి , కాగాక మసాలాదినుసులు  వేసి జీడిపప్పువేసి, బిరియానియాకు వేసి ,  పర్చిమిర్చి వెయ్యాలి.  బిరియాని రైస్   వేసి, తిప్పి  కొబ్బరి పాలు  వేసి ,సాల్ట్ కూడా వేసి కక్కేర్ మూతపెట్టి 1 విజిల్ రాగానే కట్టివేయాలి. దీ నిలోకి పెరుగుచట్ని ( దానినే కొందరు కచా మ్ బరం  అని కూడా అంటారు) వేడిగా తింటే  చాల రుచిగా ఉంటుంది.



No comments:

Post a Comment