Thursday, April 18, 2019

Cup Cakes

కావలసిన వస్తువులు    :

మైదా                  :   150 గ్ర  ( మైదా ని జల్లించి దానిలో బేకింగ్ పౌడర్ , సోడా కూడా వేసి ఉంచుకోవాలి)
ఎగ్స్                    :   3
బట్టర్                  :   120 గ్ర
షుగర్                  :   100 గ్ర
వెనిల్లా ఎసెన్స్   :   1 1/2 స్పూన్
బేకింగ్ పొడర్     :    1/2 స్పూన్
బేకింగ్ సోడ        : 1/4 స్పూన్
ట్యూటీ ఫ్రూటి     : కొంచెం



తయారువిధానము     :


ముందుగా బౌల్ లో బట్టర్ ,షుగర్  వేసి కేక్ బీటర్ తో   బీట్ చెయ్యాలి . షుగర్ కరిగింది అని అనిపిస్తే  ,   వెనిల్లా ఎసెన్స్  కూడా వేసి కాసేపు బీట్ చేసి , దానిలో ఒక ఎగ్ కొట్టి వేసి మల్లి బీట్ చెయ్యాలి ,తరువాత మరియొక ఎగ్ వేసి బీట్ చెయ్యాలి,తరువాత 3 వ ఎగ్ కూడా వేసి బీట్ చేసినప్పుడు కొంచెం   లూస్ గ ఉంటుంది.  అప్పుడు మైదా ని 3  సార్లుగా  కొంచెం కొంచెం వేస్తూ    గరిటతో స్మూత్ గ కలపాలి .  కేక్ బౌల్ లో కేక్  పేపర్ పెట్టి ఈ మిక్సీఈ ని కొంచెం వెళితీగ  వెయ్యాలి , దానిపై  ట్యూటీ  ఫ్రూటీ ని కొంచెం వెయ్యాలి.  ఒవేన్ ని ఫ్రీహిట్  చేసి  160  డిగ్రీ   లో పెట్టి 20 మినిట్స్  బే కె చెయ్యాలి . మధ్యలో చూసుకోవాలి బాగా పొంగినట్టు వస్తాయి.    చూసుకొని ముందుగా బాగా పొంగీతే  ఒవేన్ ఆఫ్ చెయ్యాలి.  లేదా కరెక్ట్ టైంకి  ఆగిపోతుంది 




1 comment: