Thursday, April 18, 2019

Gongura Roti pachhadi

కావలసిన వస్తువులు  :  

గోంగూర                     :  5 లేదా 6 కట్టలు ( ఆకు తీసి శుభ్రంగా కడిగి వడకట్టి బట్ట మీద  వేసి  బాగా                                                    ఆరనివ్వాలి)
పర్చిమిర్చి                 :  7 లేదా 8
వెల్లుల్లి                       :  6 లేదా 7 రెబ్బలు
జీలకర్ర                      :  1స్పూన్
సాల్ట్                           : 1 1/2 స్పూన్
ఆయిల్                      :  4 స్పూన్స్
పసుపు                       :  1/2 స్పూన్
ఇంగువ                     :  కొంచెం
ఆనియన్                  :  1( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తాలింపు                   :  ఆవాలు 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్, జీలకర్ర 1/4స్పూన్
కరివేపాకు                 :  1 రెబ్బ
ఎండుమిరపకాయ   : 1



తయారుచేయువిధానము     :

ముందుగా స్టవ్ వెలిగించి  మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసి , పర్చిమిర్చి వేయించాలి,వేగాక దానిలో వెల్లుల్లి ,జీలకర్ర వేసి ప్రక్కన పెట్టి , అదే  మూకుడులో ఇంకొంచెం ఆయిల్ వేసి గోంగూరని  వేయించాలి .గోంగూర వేగాక స్టవ్ ఆఫ్ చేసి ముందు గా   పైన  వేగిన పర్చిమిర్చిని కొంచెం సాల్ట్ వేసి  మిక్సీ చేసి  ఒక వేల  కా రం  ఎక్కువ అవుతుంది అని అనుకుంటే  మిక్సీ చేసిన కా రం కొంచెం ప్రక్కన కూడా పెట్టుకోవోచ్చు . అదే మిక్సీలో  గోంగూరకూడా వేసి మల్లి మిక్సీ  పడతాము.   అప్పుడు కారం ,సాల్ట్ చూసి  ఏది  తగ్గిందో  అది  కలుపుకోవచ్చు. చిన్న మూకుడు  పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి తాలింపు,ఇంగువ ,పసుపు  , కరివేపాకు,ఎండుమిర్చి  వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్ ముక్కలు వేసి, మిక్సీలో ఉన్న గోంగూరని వేసి కలిబెట్టి  బౌల్ లోకి తీసుకోవాలి. 










  టిప్
 (గోంగూర మార్కెట్ నుండి తేగానే ఆకులుతీసి కడిగి వడకట్టి   బట్ట  మీద ఆరబెట్టి బాగా ఆరాక   కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి వేయించి బాక్స్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టి  ఎప్పుడు కావాలంటే   అప్పుడు మిగిలిన పద్దతి లో పచ్చడి చేసుకోవొచ్చు  )






No comments:

Post a Comment