Thursday, April 18, 2019

Mutton Dosakaya Curry

కావలసిన వస్తువులు      :

మటన్                   : 1/2 కేజీ ( శుభ్రంగా కడిగి బౌల్ లోకి తీసుకోవాలి)
ఆనియన్స్            :  2 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
దోసకాయ              :  1 చిన్న సైజు ( పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టొమాటోస్            :   2 చిన్నవి ( కట్  చేసి ఉంచుకోవాలి)
అల్లం                    :   చిన్న పీస్
వెల్లుల్లి                  :  6 లేదా 7 రెబ్బలు( అల్ల మ్ , వెల్లుల్లి పేస్ట్ చేసి ఉంచాలి)
ఆయిల్                 :  4  స్పూన్స్
కారం                      : 2 స్పూన్స్
పసుపు                   :  1 స్పూన్
జీలకర్రపొడి          :  1 స్పూన్
గరంమసాలా         :  2 స్పూన్స్
కొత్తిమీర                 :  1 గుప్పెడు


తయారుచేయు విధానము   
ముందుగా స్టవ్ వెలిగించి  కుక్కర్  పెట్టాలి.  ఆయిల్ వేసి కాగాక  ఆనియన్స్ వెయ్యాలి,
సాల్ట్, పసుపు కూడా వేసి, కాసేపు  తిప్పాక అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి ,  మటన్  కూడా వేసి , టొమాటోస్ కూడావేసి ,కారం కూడా వేసి  కాసేపు  కూరని తిప్పి కుక్కర్ మూతపెట్టి  4 లేదా 5 విజిల్స్  వచ్చాక స్టవ్ ఆఫ్  చెయ్యాలి.  5 నిమిషాలతరువాత  కుక్కర్  మూత తీసి స్టవ్ వెలిగించి  దోసకాయముక్కలు వేసి ,జీలకర్రపొడి కూడా వేసి, కాసేపు తిప్పి, దోసకాయ మగ్గింది అనగా  గరం మసాలా కూడా వేసి, సాల్ట్ సరిపోయిందా లేదా చూసి  సరిపోకపోతే  కొంచెం వేసి,    కొంచెం ఆయిల్ తేలింది  అనగా  కొత్తిమీర చల్లి  కూర  ఒకసారి  తిప్పి , బౌల్ లోకి తీసుకోవాలి. 




2 comments:

  1. Looks so yummy 👌 I will try this curry for rotis

    ReplyDelete
  2. Looks so yummy �� I will try this curry for rotis

    ReplyDelete