Thursday, April 18, 2019

Egg Pudding


 కావలసిన వస్తువులు    :
  
పాలు                        :   1/2 లీట్ ర్
ఎగ్స్                         :   4 ( ఓన్లీ యెల్లౌస్ మాత్రమే)
కస్టర్డ్   పొడి              :   3 స్పూన్స్ ( కొంచెం పాలు వేసి కలిపి ఉంచాలి)
మిల్క్ పొడి              :  4 స్పూన్స్ ( కొంచెం పాలు వేసి కలిపి ఉంచాలి)
మిల్క్ మెయిడ్       : 1/2 (  అమూల్ మిల్క్ మెయిడ్ 1 డబ్బాలో 1/2 తీసుకుంటాయి సరి పోతుంది . కొంచెం టేస్ట్  గురుంచి  లేక పోయిన పర్వాలేదు)
వె నిల్లా ఎసెన్స్       :   1 స్పూన్
షుగర్                       :  100గ్ర






తయారు చేయు విధానము     :

ముందుగా ఒక బౌల్ లో షుగర్,  ఎగ్స్ యెల్లౌస్    వేసి  (ఎగ్ బీ టర్   లేద  కేక్ బీ టర్   తో)   బీట్ చెయ్యాలి . దానిలో  పాలు,  మిల్క్ పొడి,  కస్టర్డ్   పొడి  , వె నిల్లా ఎసెన్స్ ఒక దాని తర్వాత ఒకటి  వేసి బీట్ చెయ్యాలి  లేదా గుంటగరిటతో కూడా కలప వొచ్చు.  మిల్క్ మెయిడ్ కూడా వేసి కలిపి
ఉంచాలి.  స్టవ్ మీద  చిన్న మూకుడు కానీ బౌల్ కానీ పెట్టి దానిలో 4 స్పూన్స్ షుగర్ వేసి (వాటర్ వెయ్యకూడదు  )  స్పూన్స్ తో తిప్పుతూ ఉండాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ,మరి  1 నిమిషం ఉంచి దానిని( లోతుగాఉన్న గిన్నెలో) గిన్నెలో వేసి గిన్నెని షుగర్ సిరప్ ( దానినే కారమిల్  అని అంటారు) స్ప్రెడ్  అయ్యాటట్టు   చేసి తరవాత  దానిలో కలిపి ఉంచిన మిల్క్ ని పోసి  కుక్కర్ లో 20 మినిట్స్  ఉంచాలి( విజిల్  పెట్ట కూడదు). కొంచెం ఆరాక మూత  తీసి చాకుతో లోపల చుట్టూ ఒక సారి రౌండ్  గ  తిప్పి(  పుడ్డింగ్ కి గిన్నెకి మధ్యలో) పైన దానికి సరిపడా ప్లేట్ కానీ  వేరే బౌల్ కానీ పెట్టి  అప్ అండ్ డౌన్ చెయ్యాలి . పుడ్డింగ్ క్రింద ప్లేట్ లోకి  పడుతుంది.  ( వేడిగా ఉన్నప్పుడు త్రిప్పవోద్దు ). దాని మీద మనం బాదం  కానీ జీడిపప్పు కానీ
చిన్నగా కట్ చేసుకుంటే  చూడటానికి, తినడానికి   బాగుంటుంది.






No comments:

Post a Comment