Saturday, April 27, 2019

Ravva Dosa

కావలసిన వస్తువులు    :

మైదా                   :  1/2 కప్
బియ్యం పిండి   :   1 కప్
బొంబయి రవ్వ  :  2 కప్స్
క్యారెట్                :   1 చిన్నది ( కోరివుంచాలి)
పర్చిమిర్చి          :  2( చిన్నగా కట్ చేసి ఉంచాలి)
జీలకర్ర               :  1/4 స్పూన్
అల్లం                  : చిన్నది( బాగా సన్నగా కోరి ఉంచాలి)
సాల్ట్                    :  1 స్పూన్ ( చూసి వేసుకువాలి)
కొత్తిమీర               :  కొంచెం సన్నగా కట్ చేసి ఉంచాలి)
ఆయిల్                : కొంచెం (దోసమీద వెయ్యడానికి)

తయారువిధానము   :

ముందుగా బౌల్ లోకి పైన ఐటమ్స్ అన్నిటిని కలిపి  కొంచెం వాటర్ వేసి  పలచగా కలుపుకోవాలి దోసలపిండి కన్నా బాగా పలచగా కలుపుకో వాలి.   స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి పల్చగా గరిటతోకాని , కప్ తో కానీ పల్చగా వెయ్యాలి . పైన కొంచెం ఆయిల్ వెయ్యాలి. ముద్దగా
గనక వస్తే  మరి కొంచెం వాటర్ వేసి మల్లి వెయ్యాలి. ఫస్ట్ టైం ఐతే కొంచెం రావడం కష్టం.  1 కానీ 2 కానీ వేస్తే  మీకే తెలిసిపోతుంది. లేదా వీడియో చూడండి.  ఒక సా రి వస్తే  ఇంకా ఈజీ గ వచ్చేస్తుంది . ట్రై చెయ్యండి. ఆనందంగా తినండి. .



No comments:

Post a Comment