Sunday, April 28, 2019

Royyala Biriyani


కావలసిన వస్తువులు     :

రొయ్యలు                     :   1/2 కేజీ    ఒలిచినవి  ( బాగుచేసుకొని ఉంచాలి )
ఆనియన్స్                  :    2 ( కట్ చేసిఉంచాలి)
పర్చిమిర్చి                  :    4 ( పొడవుగా చీలికలు చేసి ఉంచాలి)
టమాటో                       :   2 ( పొడవుగా చీలికలు చేసి ఉంచాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్    :    3 స్పూన్స్
గరంమసాలాపొడి       :    3 స్పూన్స్
కా రం                           : 1 1/2 స్పూన్స్ ( కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు)
సాల్ట్                             :  1 1/2 స్పూన్స్( సాల్ట్ చూసి మల్లి వేసుకోవొచ్చు)
పసుపు                         :   1 స్పూన్
పొదీనా                         :  3 కట్టలు ( ఆకు తీసి కడిగి ఉంచాలి)
కొత్తిమీర                       :   2 కట్టలు   ( ఆకు తీసి కడిగి ఉంచాలి)
బాసుమతి రైస్            :  1/2 కేజీ  (  బిరియాని చేసే  ముందు అర గంట ముందు నానబెట్టాలి)
మసాలాలు                  : లవంగాలు 4, యాలకులు 4, దాచినచెక్క  2  చిన్నవి,మరటిమొగ్గ 1, అనాసపువ్వు  1, బిరియాని ఆకు 3

నెయ్యి                          :  4 స్పూన్స్
ఆయిల్                        : 3 స్పూన్స్

తయారుచేయువిధానము    :


 ముందుగా  ఒక  గిన్నెలో  వాటర్ వేసి  ఒక స్టవ్ మీద పెట్టాలి.  ఇంకొక స్టవ్ మీద బిరియానికి గిన్నె పెట్టి దానిలో నెయ్యి, ఆయిల్ కూడా వేసి కాగాక మసాలాదినుసులు ( లవంగాలు యాలకులు దాచినచెక్క  అవి) వెయ్యాలి .  తరవాత ఆనియన్స్ వేసి, పర్చిమిర్చి  వేసి,
అల్లం వెల్లుల్లి పేస్ట్,బిరియాని ఆకు, సాల్ట్ , పసుపు,  టమాటో,ఒక దాని తరువాత ఒకటి కొంచెం గ్యాప్ లో వెయ్యాలి.  కా రం , రొయ్యలు కూడా వెయ్యాలి. కాసేపుతిప్పుతూఉండాలి.  ఈలోపు పైన మరుగుతున్న గిన్నెలో బాసుమతి బియ్యంవేసి,కొంచెం సాల్ట్ కొంచెం పొదీనా , ఇంకా సోంపు 1 స్పూన్  కూడా వేసి  రైస్  ఉడకనివ్వాలి . రైస్ లో సాల్ట్ సరి పోయిందో లేదో చూసుకోవాలి.   ఈలోపు రొయ్యలలో మసాలా కూడా వేసి తిప్పుతూ ఉండాలి. పైన రైస్ పట్టి చూడాలి , 75% ఉడికింది  అనగానే  కన్నాల   గరిటతో రైస్ ని తీసి నీరు పోయాక   రైస్ ని   రొయ్యలమీద  పరవా లి.  అక్కడ నుండి రైస్ ని వెంటవెంటనే  గరిటతో తీసి నీరు లేకుండాచూసి  వడకట్టుకుంటూ   కూర మీద మొత్తం  పరవాలి.  (రైస్ ని కొంచెం  ఫాస్ట్ గా  పరవా లి.)   రైస్ మీద  అమూల్ బట్టర్ ని  కొంచెం తీసుకొని  చిన్న చిన్న ముక్కలుగా  చేసి  అక్కడక్కడా  పెట్టి ,  గ్లాస్ లేదా మామూలు మూతని పెట్టి  ఆవిరి పోకుండా   ఒక నాప్కిన్ ని  మంటకి తగలకుండా పైన లిడ్ మీద ఉంచాలి. 8 నిమిషాలలో  రొయ్యలబిరియాని రెడీ.  గరిటతో  అడుగునుండి పైకి  రైస్ ని కూరతో పా టు  తిరగవేయ్యాలి. 















No comments:

Post a Comment