Tuesday, April 16, 2019

Vankaya Masala Curry

కావలసిన వస్తువులు :

వంకాయలు           : 1/4 కేజీ ( 2 చీలికలుగా చివర విడిపోకుండా కట్ చేసి వాటర్ లో ఉంచాలి కొంచెం  సాల్ట్ కూడావెయ్యాలి)
ఆనియన్స్             :   2( కట్ చేసి  మిక్సీ లో కచ్చా బిచ్చగా మిక్సీ చెయ్యాలి)
టొమాటోస్              :  2( కట్ చేసి మిక్సీయే చెయ్యాలి)
అల్లం                      :  చిన్న ముక్క
వెల్లుల్లి                    :  4 లేదా 5 రెబ్బలు ( అల్లం ,వెల్లుల్లి మిక్సీ  పట్టి ఉంచాలి)
కరివేపాకు               :  2 రెబ్బలు
పర్చిమిర్చి              :  2
కొత్తిమీర                  :  కొంచెం
కా రం                      :  1 స్పూన్
పసుపు                     :  1 స్పూన్
గరం మసాలా         :  1 స్పూన్
సాల్ట్                         : 1 స్పూన్
ఆయిల్                   :  4 స్పూన్స్
తాలింపు                 :  ఆవాలు 1 స్పూన్. జీలకర్ర 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్


తయారువిధానము     :

ముందుగా స్టవ్ వెలిగించి  మూకుడుపెట్టి   ఆయిల్  వేసి  వంకాయలు వేసి, ( మూతపెట్టి వేయించాలి).  కొంచెం మగ్గినట్టుగా వేయించాలి.వాటిని వేరే బౌల్ లో తీసుకోవాలి. అదే  మూకుడులో ఇంకొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసి,కరివేపాకు వేసి,  పర్చిమిర్చి వేసి  ఆనియన్ పేస్ట్ కూడా వేసి,సాల్ట్ పసుపు, వెయ్యాలి. 2 నిమిషాలు తరువాత టమాటో పేస్ట్ కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కా రం, మసాలాకూడా వేసి  కొంచెం సేపు  పచ్చి వాసన  పోయే దాక తిప్పి మగ్గిన వంకాయలు కూడా వేసి , సన్నటి   మంటమీద  మూత పెట్టి ఉంచాలి.  ఆయిల్ కొంచెం తేలినప్పుడు  కూర బౌల్ లోకి తీసుకోవాలి.





No comments:

Post a Comment