Friday, May 3, 2019

Chekkalu


చెక్కలు 
కా వ లసిన వస్తువులు    :

బియ్యపు పిండి         :    2 కప్స్
అముల్ బట్టర్          :  2 స్పూన్స్
జీలకర్ర                     :  2 స్పూన్స్
అల్లం                        :  2 అంగుళాల ముక్క
పర్చిమిర్చి                :  8  ( కారం  కొంచెం ఎక్కువ కావాలి అంటే  ఇంకొక 3 వేసుకోవచ్చు)
సాల్ట్                          :  సరిపడ
పెసరపప్పు               :  1 కప్ ( కొంచెం నీటిలో వేసి 2 నిమషాలు ఉంచాలి)
తయారుచేయువిధానము   :

ముందుగా ఒక బౌల్ లోకి బియ్యపు పిండి ని తీసుకొని  దానిలో సాల్ట్ వేసి , బటర్  కూడా వేసి  ,
 బా గ  పిండి కలపాలి.  తరవాత జీలకర్ర , అల్లం,వెల్లుల్లి పేస్ట్ ( ముందుగా అల్లం వెల్లుల్లి  ని  పేస్ట్ చెసి  ఉంచాలి )  ని వేసి  పెసరపప్పు కూడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపి 2 లేదా 3 ఉండలుగా చేసి మూతపెట్టి ఉంచాలి.  ఇప్పుడు  సాల్ట్,కారం కూడా చూసి మీకు ఇంకా కారం కావాలి  అని అనుకుంటే  ఇంకొన్ని పర్చిమిరపకాయలు మిక్సీపట్టి  వెయ్యవొచ్చు. పిండి కారం గ ఉంటేనే  వేగినప్పుడు కారం సరిపోతుంది.     చేసినప్పుడు ఒకొక్క ముద్ద  తీసి చేసుకోవాలి .  ముందుగా ఒక పాత  కాటన్  బట్టని  లేదా టవల్ ని  తడిపి నీరు లేకుండా గట్టిగా  పిండి గట్టు మీద వేసుకొని సగం బట్ట మీద  ఉండలు చేసి  పెట్టి మిగిలిన సగం బట్ట ని కప్పి ఒక గ్లాస్ తో గాని  గిన్నెగాని పెట్టి ఒకొక్క దానిని నొక్కితే  తొందరగా  చెక్కలు చెయ్యవోచ్చు. పైన బట్టని తీసి చెక్కలు ఒకే షేప్ లో వస్తాయి కదా. చేతితో  కొంచెం ప్రెస్సుచేసి  వాటిని కాగిన ఆయిల్ లో జాగర్తగా చిన్న   మంట    పెట్టు కొని  వేయించాలి. 


No comments:

Post a Comment