Friday, May 3, 2019

Panasa Biriyani


పనస బిరియాని 
కావలసిన వస్తువులు    :

బాసుమతి రైస్            :  1/2 కేజీ ( బిరియాని చేసే ముందు 1/2 గంట నానబెట్టాలి)
పనసముక్కలు           :  1/2 కేజీ ( వేడినీటిలో కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఉడికాక వడకట్టి ఉంచాలి)
ఆనియన్స్                  :   2(కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి)_
పర్చిమిర్చి                  :   4 ( చీలికలిగా కట్ చేసుకోవాలి  )
టొమాటోస్                  :   2 పెద్దవి ( పొడవుగా కట్ చేసుకోవాలి)
పసుపు                        :   1 స్పూన్
సాల్ట్                            :    2 స్పూన్స్ ( సరిపడినంత)
గరంమసాల               :    2 స్పూన్స్
జీరాపొడి                     :   2 స్పూన్స్
అల్లం వెల్లులి పేస్ట్   :   3 స్పూన్స్ 
పొదీనా                       : కొంచెం
కొత్తిమీర                     :  కొంచెం
బిరియాని ఆకు          :  3
పెరుగు                       : 4 స్పూన్స్
నెయ్యి                        :   4 లేదా 5 స్పూన్స్
హోల్ మసాలా         :  యాలకులు 4, లవంగాలు 4, దాచిన చెక్క చిన్నది,అనాసపువ్వు  2
సోంపు   2 స్పూన్స్ , మరాఠి మొగ్గ   2,

  తయారుచేయు విధానము    :

ముందుగా  స్టవ్  వెలిగించి బిరియానికి  గిన్నె పెట్టాలి.  దానిలో నెయ్యి వేసి కాగాక హోల్ మసాలా  వెయ్యాలి.  ఆనియన్స్ వేసి, సాల్ట్ , పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, బిరియాని ఆకు, వేసి తిప్పి, పర్చిమిర్చి వెయ్యాలి. ఈలోపు వేరే స్టవ్  మీద  గిన్నెలో వాటర్ పోసి   కాగాక బాసుమతి  రైస్ వెయ్యాలి .  అది ఉడుకుతూ ఉంటుంది. పైన బిరియాని గిన్నెలో  టొమాటోస్ వేసి . పెరుగు కూడా వేసి, ఉడికిన పనసముక్కలుకూడావేసి, కారం, కొంచెం పసుపు ,  జీరాపొడి,మసాలాపొడి, పొదీనా, కొత్తిమీర కూడా వేసి, తిప్పుతూ ఉఁడాలి. ఈ లోపు రైస్ 75%
ఉడికించి అని అనుకోగానే  కన్నాల గరిటతో రైస్ వడకట్టినట్టుగా కొంచెంకొంచెం కూర మీద పరవాలి.  అట్లా మొత్తం రైస్ ని వడ కట్టు కుంటూ పరిచి మధ మధ్యలో పొదీనా చల్లవోచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నా  అవి కూడా వెయ్యవోచ్చు. పైన అముల్  బట్టర్ ని చిన్న చిన్న ముక్కలు చేసి కొన్నిటిని అక్కడక్కడా వేసి  పైన మూతపెట్టి  ఒక నాప్కిన్  ని కింద మంట  తగలకుండా  పైన కప్పాలి.  చిన్న మంట పెట్టి  , 8 నిమిషాలతరువాత  స్టవ్ ఆఫ్ చేసి .జాగర్తగా అడుగునుండి  కూరని పైకి తీస్తూ  బిరియాని ని వడ్డించాలి. 



   

No comments:

Post a Comment