Thursday, May 2, 2019

Noodles Street food


నూడుల్స్ స్ట్రీట్ ఫుడ్ 
కావలసిన వస్తువులు     :

నూడుల్స్                :   పాకెట్లో సగం ( మార్కెట్ లో ప్యాకెట్ దొరుకుతుంది)
ఆనియన్స్               :  1 ( పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి)
కేరట్                        : ! ( సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి)
కేబేజి                        :  కొంచెం  ( సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి               : 3  ( సన్నగా చీలికలు చేసుకోవాలి)
కారం                        :  1 స్పూన్
గరం మసాలా          :  1 స్పూన్
జీలకర్ర పొడి           : 1  స్పూన్
సాల్ట్                         : 1 స్పూన్ ( సరిపడా)
సోయాసాస్              :  1 1/2 స్పూన్
వెనిగర్                     :  1 1/2 స్పూన్
కొత్తిమీర                   :  1 కట్ట ( కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి)
ఆయిల్                   :    4 స్పూన్స్
మేగీ మసాలా           :  మనకి ఇంకా మసాలా కావాలి అంటే  అదికూడా వేసుకోవచ్చు ( మార్కెట్ లో ప్యాకెట్ దొరుకుతుంది)

తయారుచేయువిధానము  :

 ముందుగా నూడుల్స్ ని వేడి నీటిలో  ఉడికించి జల్లెడలో వార్చుకోవాలి. నూడుల్స్ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్,  సాల్ట్ కూడా వేసుకోవాలి.  స్టవ్ మీద మూకుడు  పెట్టి
ఆయిల్ వేసి కాగాక  ఆనియన్స్, పర్చిమిర్చి వేసి తిప్పి , సాల్ట్ వేసి , కేరెట్ ,కేబేజి,
వేసి తిప్పి సోయాసాస్ , వెనిగర్, కూడా వేసి , తిప్పి నూడుల్స్ కూడా వేసి ,కారం , జీరా పొడి, మసాలాపొడి, కొంచెం కొత్తిమీర వేసి తిప్పాలి.  ఫోర్క్ లాంటి దానితో తిప్పితే  బాగుంటుంది . మనకి ఇంకా ఘాటుగా కావాలి అంటే  మ్యాగీ  మసాలా కూడా వేసుకున్న బాగుంటుంది.   లేదు అంటే వెయ్యక పోయిన  లైట్ గ ఉండి బాగుంటుంది.  హీత్య్ గ ఉంటుంది . మార్కెట్ లోవి
మనకి తెలియని వేస్తారు.  అది అంత మంచిది కాదు కాబట్టి  స్ట్రీట్ నూడుల్స్  తినాలంటే
ఈవిధంగా చేసు కుంటే  ఆరోగ్యానికి ఆరోగ్యం.


No comments:

Post a Comment