Wednesday, May 1, 2019

Dosakaya Pachhadi

కావలసిన వస్తువులు     :

దోసకాయ               :  1 చిన్నది ( పీల్ చేసి గింజలు తీసి సన్నగా చిన్నటి  ముక్కలుగా కట్ చేసుకోవాలి )
కొబ్బరి                    :  చిన్నవి 4 లేదా 5 ముక్కలు
చింతపండు          :  చాల కొంచెం
పర్చిమిర్చి             :   6
జీలకర్ర                  :  1 స్పూన్
పెరుగు                   :  2 స్పూన్స్
వంకాయలు           : 2 ( కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి                   :  6 రెబ్బలు
తాలింపు                :  1 స్పూన్ మినపప్పు,  1 స్పూన్ సెనగపప్పు, 1 స్పూన్ ఆవాలు,  కరివేపాకు 1  రెబ్బ, ఎండుమిరపకాయ  1
పసుపు                   : 1/2 స్పూన్
ఆయిల్                  :  సరిపడ

తయారుచేయువిధానము     :

ముందుగా   స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి  పర్చిమిర్చి,  వంకాయలు,  కొబ్బరి ఆయిల్ వేసి    వేగనివ్వాలి , వేగింది  అని అనుకోగానే   దానిలో వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర    వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసి  , సాల్ట్ కూడా వేసి  ఆరాక మిక్సీ పట్టాలి.  అది గిన్నెలోకి తీసుకొని  దానిలో దోసకాయ ముక్కలు, పెరుగు  కలపాలి. కొత్తిమీర ఉంటే అదికూడా కలపొచ్చు .  తాలింపుకు చిన్న మూకుడు  పెట్టి కొంచెం ఆయిల్ వేసి  ,కాగాక  తాలింపు వేసి, కొంచెం పసుపు కూడా   వేసి  పైన చ్చడిలో  కలపాలి. 




No comments:

Post a Comment