Wednesday, May 1, 2019

Madatakaja

కావలసిన వస్తువులు          :

మైదా                     : 1/2 కేజీ ( జల్లించి ఉంచాలి)
నెయ్యి                   :  5 స్పూన్స్
బేకింగ్ సోడ         :  1 1/2 స్పూన్
వాటర్                   : సరిపడ
పంచదార             :  750 గ్ర   
ఆయిల్                 :  1/4 కేజీ    లేదా 1/2 కేజీ          

తయారుచేయువిధానము 

ముందుగా ఒక బౌల్ లో మైదా ,బేకింగ్ సోడా  వేసి కలిపి ,దానిలో నెయ్యి వేసి పిండిని బాగా కలపాలి.   అప్పుడు కొంచెం కొంచెం వాటర్  వేస్తూ  చపాతీ పిండి  లాగా కలుపుకోవాలి. మూత పెట్టి  1/2 గంట [ప్రక్కన ఉంచాలి . ఈలోపు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి  పంచదారవేసి కొంచెం వాటర్ వేసి తిప్పాలి. ఎక్కువ వాటర్ వేస్తే పాకం లేట్ అవుతుంది. తిప్పినప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ వేస్తే  పంచదార  పాకం ఎన్ని రోజులు ఉన్న  దగ్గరికి  అవ్వదు మైదా ముద్దని  గట్టు మీద  వేసి బాగా   చేతితో కాసేపు మర్దన చెయ్యాలి. అప్పుడు పిండి మొత్తా న్ని  చపాతిలాగా చాల పలచగా చేసుకోవలి .  క్రాస్  వస్తే  క్రా సులని  చాక్ తో తీసి చివరలు పెట్టి మల్లి  చపాతిలాగా చేసి స్క్వేర్  లాగా చాక్ తో కట్ చేసి  దాని మీద నెయ్యి రాసి  చేతితో మొత్తం స్క్వేర్   మీద రాసి మైదా మాత్రం చల్లాలి .మైదా ని చేతితో రాయకూడదు.  అప్పుడు మొదట నుండి చపాతీని మెల్లిగా రౌండ్ గ చుట్టూ కుంటూ రావాలి . లూజు గా రాకూడదు . చివరికి వచ్చాక చివరన కొంచెం వాటర్ తో తడిపి  చుట్టెయ్యాలి. ఆచివర   ఈచివర  కరెక్ట్ గ రాకపోతే  చాక్ తో కట్ చెయ్యాలి. వన్ ఇంచ్  దూరంగా చాక్ తో కట్ చెయ్యాలి. ఒక్కొక్క  దానిని  ముందు చూపుడు వేలితో  కొంచెం ప్రెస్ చేసి అప్పడాల కర్రతో లైట్ గ ప్రెస్ చెయ్యాలి .స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి  ఆయిల్ వేసి   ఆయిల్ కాగాక స్టవ్ ఆఫ్ చేసి మూకుడిని క్రిందకి దించి ప్రెస్ చేసిన వాటిని వేసి  అవి పైకి వస్తాయి .వచ్చాక స్టవ్ వెలిగించి  అదే మూకుడు  పెట్టి వేగనివ్వాలి . వేగాక వాటిని పాకం లో వేసి 5 నిమిషాలు ఉంచాక  ప్లేట్ లోకి  తీసుకోవాలి. అట్లా అన్నిటిని  చెయ్యాలి  వేడి వేడిగా  ఆరోజె  తింటే  ఇంకా చెప్పక్కరలేదు.

No comments:

Post a Comment