Saturday, May 4, 2019

Goduma Ravva Upma

కావలసిన వస్తువులు    :

గోధుమ రవ్వ                : 1 గ్లాస్
వాటర్                           :  2 1/4 గ్లాస్
ఆనియన్స్                    :  1 చిన్నముక్కలుగా  కట్ చేసుకోవాలి
వేరుశెనగ పప్పు            :   1 కప్
టొమాటోస్                    : 2 చిన్నవి ( కట్ చేసి ఉంచాలి)
పర్చిమిర్చి                   :  7( సన్నగా పీలికలు చేసుకోవాలి  )
అల్లం                           :  1 చిన్న ముక్క ( కోరుకోవాలి)
కేరట్                            :   1 చిన్నది ( కోరుకోవాలి)
పసుపు                          :  1 స్పూన్
సాల్ట్                             :  2 స్పూన్స్  (చూసి వేసుకోవాలి)
ఆయిల్                        :  4 స్పూన్స్
తాలింపు                      : ఆవాలు  1 స్పూన్, సెనగపప్పు   1 స్పూన్,   మినపప్పు  1 స్ప్పోన్
కరివేపాకు                    :   2 రెబ్బలు
కొత్తిమీర                       :  కొంచెం

తయారుచేయువిధానము    :

ముందుగా  వాటర్  ఒక బౌల్ లో వేసి స్టవ్ మీద పెట్టాలి.  వేరే స్టవ్ మీద  మూకుడు పెట్టి  ఆయిల్ వేసి , కాగాక  తాలింపు వెయ్యాలి,  కరివేపాకు ,  తరవాత ఆనియన్స్ , పర్చిమిర్చి అల్లం, వేరుసెనగపప్పు, సాల్ట్, పసుపు, కేరట్   అన్నిఒక దానితరవాత ఒకటి వెయ్యాలి. టొమాటోస్ కూడా వెయ్యాలి. మూతపెట్టి చిన్న మంట  మీద కాసేపు ఉంచి , మూత   తీసి  మరిగిన నీరు వేసి,
సాల్ట్ చూసి చాలకపోతే  కొంచెం వేసుకోవాలి . దానిలోకి రవ్వ  1 గ్లాస్ వెయ్యాలి. గరిటతో తిప్పి మూత  పెట్టి  7 నిమిషాల చిన్న మంట  మీద ఉంచాలి.  తరువాత  మూత  తీసి మల్లి ఒక సారి కలిపి  మల్లి మూత  పెట్టి సన్నటి సెగ మీద ఉంచాలి.   4 నిమిషాల తరువాత  తిప్పి చూసుకోవాలి  నీరు అంత  పోయి దగ్గరికి  అవుతుంది.  అప్పుడు కొత్తిమీర చల్లి  తియ్యాలి.
వేడి వేడిగా తింటే  చాలా టేస్టీగా  ఉంటుంది. నిమ్మకాయ పిండు కుంటే కూడా బాగుంటుంది.

,


No comments:

Post a Comment