Monday, May 6, 2019

pesarapappu bombai ravva sweet

పెసరపప్పు  బొంబాయి  రవ్వ స్వీట్ 

కావలసినవస్తువులు    :

పెసరపప్పు          :  100 గ్ర
బొంబాయి రవ్వ   :  100 గ్ర
పాలు                    :  3  కప్స్
నెయ్యి                  :  3 స్పూన్స్
పంచదార            :  200 గ్ర
ఆయిల్                :  వేయించడానికి
యాలకుల పొడి :    2 స్పూన్స్

తయారుచేయువిధానము   :

ముందుగా పెసరపప్పుని  మూకుడులో  ఒట్టినే ఏమి వెయ్యకుండా    కొంచెం వేయించాలి  .
 పెసరప్పుని 1  కి 2  గ్లాస్  పాలు  వేసి   కుక్కర్ లో పెట్టి  2 విజిల్స్ వచ్చాక కట్టి,ఆరాక తీసి  మెత్తగా  మెదిపి ఉంచాలి. లేదా గ్రైండ్  చేసుకోవొచ్చు . వేరొక మూకుడులో ( 1 గ్లాస్ బొంబాయి రవ్వకి  2 గ్లాస్ ల పాలు  కొలత )ముందు  పాలు వేసి  దానిలో  బొంబాయి రవ్వ  వేసి పొయ్యి మీద పెట్టి తిప్పుతూ ఉండాలి.ఉడికి దగ్గరికి   అవుతుంది అనగానే 2 స్పూన్స్ నెయ్యి వేసి , ఒకసారి కలిపి  పెసరప్పు ముద్దని కూడా వేసి  మిగిలిన నెయ్యి వేసి చిన్న మంట  మీద దగ్గరికి అవ్వగానే స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఈలోపు వేరే బౌల్ లో పంచదార లో  కొంచెం వాటర్ వేసి  స్టవ్ మీద పెట్టి తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి  దానిలో యాలకుల పొడి వేసి  ప్రక్కన ఉంచాలి . మూకుడులో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి ఉంచాలి. ఈలోపు పెసరపప్పు ముద్దని   చిన్న చిన్న ఉండలుగా చేసి  బాదుషా లాగా  చేసి మధ్య లో వేలితో గుంట లాగా చేసి చుట్టూ టూత్ పిక్ తో గాటు పెట్టి నట్టు పెట్టి.  అన్ని అట్లాగే చేసుకొని  ఆయిల్ లో సరిపడా  5 లేదా 6 చొప్పున వేయించి ,వేగాక
పాకం లో వేసి కాసేపు ఉంచి తియ్యాలి.  ఇది చాల టెస్ట్ గ  ఉంటుంది.





No comments:

Post a Comment