Monday, May 6, 2019

potlakaya curry


కావలసిన వస్తువులు     :

పొట్లకాయ            :  1/2 కెజి (చాక్ ని బ్యాక్ సైడ్ తిప్పి పైన పీల్ చెయ్యాలి లైట్ పోర పోతుంది
                                సన్నగా చిన్నగా కట్ చేసు కోవాలి)
ఉల్లిపాయలు      :  3 పెద్దవి ( కట్ చేసి ఉంచాలి)
పర్చిమిర్చి          :  5 ( చీలికలు  గ చెయ్యాలి)
వేరుశెనగపప్పు   :  ఒక చిన్న కప్ (మూకుడులో కాసేపు వేపి ఆరాక పొట్టు  తీసి కొంచెం బద్దగా చేతితో  అనాలి)
కొబ్బరి                  :  చిన్న చిప్ప ( కోరి ఉంచాలి)
ఆయిల్                :   3 స్పూన్స్
తాలింపు              : ఆవాలు 1 స్పూన్ ,బద్దమైనపప్పు 1 స్పూన్ జీలకర్ర  1 స్పూన్,
వెల్లుల్లి                 : 5 రెబ్బలు
కరివేపాకు            :  2 రెబ్బలు
కొత్తిమీర               :  కొంచెం
సాల్ట్                     :  సరిపడ
పసుపు                 :  1 స్పూన్

తయారుచేయువిధానము    :

ముందుగా  మూకుడు  స్టవ్ మీద పెట్టి  ఆయిల్ వేసి , వెల్లుల్లి వేసి , తాలింపు వెయ్యాలి.  కరివేపాకు  వేసి, ఉల్లిపాయలు వేసి  , సాల్ట్ , పసుపు వేసి , కాసేపు తిప్పి పొట్లకాయ ముక్కలు వెయ్యాలి. ముక్కలని కొంచెం తిప్పాక  ,మూత పెట్టి సన్నటి సెగ మీద ఉంచాలి. కొంచెం వేగింది  అని అనుకోగానే  వేరుశెనగపప్పు, కొబ్బరివేసి తిప్పి సాల్ట్ కారం చూసుకొని, కొత్తిమీర చల్లి  , బౌల్ లోకి తీసుకోవాలి. పొట్లకాయ ఎక్కువ సేపు వేగ కూడదు.


No comments:

Post a Comment