Tuesday, May 7, 2019

Potlakaya Perugu Pachhadi

కావలసిన వస్తువులు    :

పొట్లకాయ              :  1/4 కేజీ (చాక్   రివర్స్ సైడ్  తో కొంచెం పీల్ చేసి సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి )
పర్చిమిర్చి            :   6
జీలకర్ర                 :  1 స్పూన్
చింత పండు        :  చాల కొంచెం
పెరుగు                  :  1 కప్
వెల్లుల్లి                  :  రెబ్బలు 5
సాల్ట్                      :  సరిపడ
పసుపు                   :  1/4 స్పూన్ 
తాలింపు               :   ఆవాలు  1 స్పూన్, జీలకర్ర  1 స్పూన్, బద్ద మినపప్పు  1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3 , కరివేపాకు 1 రెబ్బ,
కొత్తిమీర                :  కొంచెం
ఇంగువ                :  కొంచెం
తయారుచేయువిధానము    :

ముందుగా    కొంచెం ఆయిల్ లో  పర్చిమిర్చి ని వేయించి, జీల కర్ర కూడావేసి  వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చింతపండు వేసి ,  మిక్సీ  పట్టి  ప్రక్కన ఉంచాలి.  స్టవ్ మీద  వేరే బౌల్ లో పొట్లకాయ ముక్కలు ,కొంచెం సాల్ట్ ,పసుపు వేసి మూత  పెట్టి 4 నిమిషాలు  ఉంచి స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక బౌల్ లోకి తీసుకొని  దానిలో  మిక్సీ చేసిన పర్చిమిర్చి  ని సగం వేసి  , పెరుగు కూడా వేసి  సాల్ట్ చూసి, సరిపోకపోతే  కొంచెం వేసు కోవాలి.  కారం కూడా చాలకపోతే మిగిలిన కారం కూడా వేసి  ప్రక్కన పెట్టి. దానికి తాలింపు కలపాలి . ( చిన్న మూకుడు  స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి , తాలింపు సామాను,  ఇంగువ కూడా  వేసి , కొత్తిమీర కూడా వెయ్యాలి  )

No comments:

Post a Comment