Sunday, May 5, 2019

thotakoora pappu

కావలసిన వస్తువులు    :

తోటకూర     :   4 కట్టలు (సుబ్బరంగా కడిగి కట్ చేసుకోవాలి
ఆనియన్స్   :  1 (కట్ చేసి ఉంచాలి)
పర్చిమిర్చి   :  2( కట్ చెయ్యాలి )
టొమాటోస్    :  3 ( కట్ చేసి ఉంచాలి
కారం             : 2 స్పూన్స్
పసుపు          :  1 స్పూన్
కందిపప్పు    :  1 చిన్న కప్  ( కడిగి  1 1/2 కప్ వాటర్ వేసి ఉంచాలి)
తాలింపుకు   :  ఆవాలు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్, మి నపప్పు 1 స్పూన్ ,
కరివేపాకు     :  2 రెబ్బలు
వెల్లుల్లి          :  4 రెబ్బలు
ఆయిల్         :  2 స్పూన్స్
ఇంగువ         :  కొంచెం
  
తయారుచేయువిధానము    :

 ముందుగా కుక్కర్లో  తోటకూర,ఆనియన్స్,పర్చిమిర్చి, టొమాటోస్, కారం, పసుపు, సాల్ట్,  కందిపప్పు వాటర్ తో సహా (అంటే  1 కందిపప్పుకి  1 1/2 కప్ వాటర్ అన్నమాట )  వేసి   4 లేదా 5  విజిల్స్  వచ్చాక కట్టెయ్యాలి.  చల్లారాక  మూట తీసి స్టవ్ ఆన్ చేసి గరిటతో బాగా తిప్పి దగ్గరికి అయ్యాక వేరే స్టవ్  మీద  చిన్న మూకుడు పెట్టి ఆయిల్ వేసి   వెల్లుల్లి వేసి తాలింపు సామాను వేసి, ఇంగువ కొంచెం వేసి.  కరివేపాకు వేసి.    కూర లో వెయ్యాలి. 

No comments:

Post a Comment